ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జగన్‌ పాలనలో బీసీల అణచివేత

ABN, First Publish Date - 2022-12-07T23:30:20+05:30

జగన్‌ రెడ్డి పాలనలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి అన్నారు. శ్రీకాకుళం 44వ డివిజన్‌లో బుధవారం సాయంత్రం ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వ హించారు. అలాగే, కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసగించిందన్నారు.

శ్రీకాకుళంలో ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ పోస్టర్లను ప్రదర్శిస్తున్న కూన రవికుమార్‌, గుండ లక్ష్మీదేవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జగన్‌ రెడ్డి పాలనలో బీసీలు అణచివేతకు గురవుతున్నారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే లక్ష్మీదేవి అన్నారు. శ్రీకాకుళం 44వ డివిజన్‌లో బుధవారం సాయంత్రం ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వ హించారు. అలాగే, కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ప్రజలను వైసీపీ ప్రభుత్వం మోసగించిందన్నారు. బీసీలకు కల్పించాల్సిన రిజర్వేషన్‌లను సైతం ప్రభుత్వం విస్మరి స్తోందని దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే ప్రజల జీవితాలు బాగు పడతాయన్నారు. కార్యక్ర మంలో నాయకులు పీఎంజే బాబు, టి.వెంకన్నయాదవ్‌, మాదా రపు వెంకటేష్‌, తదితరులు పాల్గొన్నారు.

వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపాలి

కొత్తూరు: రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానా లను అవలంబిస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని మాజీ ఎమ్మెల్యే కలమట వెంకట రమణ మూర్తి కోరారు. బుధవారం కడుం పంచాయతీ కడుం కాలనీలో ‘ఇదేం ఖర్మ మన రాష్ర్టా నికి’ కార్యక్రమం నిర్వ హించారు. ఇంటింటికీ వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబును సీఎంగా చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గోవిందరావు, నేతలు మాతల గాంధీ, కొమరపు వెంకట రావు, గోవిందరావు, జమ్మి నాయుడు, శ్రీను బాబు తదితరులు పాల్గొన్నారు. సారవకోట మండలం చిన్నకిట్టాలపాడు పంచాయతీ బొంతు గ్రామంలో బుధవారం ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పాల్గొని వైసీపీ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. టీడీపీ నాయకులు ధర్మాన తేజకుమార్‌, సురవరపు తిరుపతిరావు, కత్తిరి వెంకటరమణ, బైరి భాస్కరరావు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T23:30:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising