ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం

ABN, First Publish Date - 2022-07-01T06:11:32+05:30

ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో 45 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం గురువారం ముగిసింది.

చిన్నారులకు సర్టిఫికెట్లు అందజేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ జమల పూర్ణమ్మ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముగిసిన వేసవి విజ్ఞాన శిబిరం

గవర్నర్‌పేట, జూన్‌ 30: ఠాగూర్‌ స్మారక గ్రంథాలయంలో 45 రోజులుగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం గురువారం ముగిసింది. ఈ సందర్భంగా కృష్ణాజిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ జమలపూర్ణమ్మ చిన్నారులకు శిక్షణ ఇచ్చిన మాస్టర్లు మల్లిక్‌, శ్రీమన్నారాయణ, రవిబాబు, బొడ్డపాటి రాజు, కళాసాగర్‌, రాణి, శివనాగేశ్వరిలను శాలువా కప్పి, మెమొం టోలు అందించి సత్కరించారు. విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు, పుస్తకాలు బహుమతులుగా అందిం చారు. లైబ్రేరియన్లు కె. నాగరాజు, కె. మధుసూదన రాజు, ఏ. రామచంద్రుడు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్‌ జమలపూర్ణమ్మను ఘనంగా సత్కరించి మెమొంటో అందజేశారు. 

సత్యనారాయణపురం:  సత్యనారాయణపురం చిత్తరంజన్‌శాఖా గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరం ముగింపు కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా  శారదా జూనియర్‌ కాలేజి ప్రిన్సిపాల్‌ లుక్కా శ్రీధర్‌   మాట్లాడుతూ  చిన్ననాటి నుంచే విద్యార్థులు తప్పని సరిగా పుస్తక పఠనం అలవరుచుకోవాలని చెప్పారు. అనంతరం క్యాంప్‌లో విద్యార్థులు పేపర్‌ ఆర్ట్స్‌తో తయారు చేసిన వస్తువులను తిలకించారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విశ్రాంత లెక్చరర్‌ బి. సరస్వతి,గ్రంథాలయాధికారి పి.సంపత్‌ కుమార్‌, పాఠశాల విద్యార్థులు, గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-07-01T06:11:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising