బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన
ABN, First Publish Date - 2022-10-18T05:09:26+05:30
తమ గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతు న్నామని బూరగాం ప్రాంతానికి చెందిన పలువురు విద్యార్థు లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి బూరగాం ప్రాంతానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట భైఠాయించి ఆందోళన చేపట్టారు.
టెక్కలి రూరల్: తమ గ్రామాలకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సుల సదుపాయం లేకపోవడంతో ఇబ్బందులు పడుతు న్నామని బూరగాం ప్రాంతానికి చెందిన పలువురు విద్యార్థు లు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం రాత్రి బూరగాం ప్రాంతానికి చెందిన విద్యార్థినీ, విద్యార్థులు స్థానిక ఆర్టీసీ డిపో ఎదుట భైఠాయించి ఆందోళన చేపట్టారు. బస్సు ల కోసం ఆర్టీసీ సిబ్బందిని అడుగ్గా నిర్లక్ష్యంగా సమాధాన మి స్తున్నారని పలువురు విద్యార్థులు వాపోయారు. బస్సు పాసు లు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని, ఇంటర్, డిగ్రీ విద్యా ర్థులు ఆర్టీసీ బస్సుల సదుపాయం లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలలో కళాశాలలకు వస్తూ ఇబ్బందులు పడుతున్నామని వాపో యారు. ఈ నిరసనకు ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు మద్దతు తెలిపారు. విషయం తెలుసుకున్న టెక్కలి పోలీసులు అక్కడికి చేరుకుని ఆర్టీసీ అధికారులు, విద్యార్థులతో మాట్లాడడంతో విద్యార్థులు నిరసనను విరమించారు.
Updated Date - 2022-10-18T05:09:26+05:30 IST