ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తుపాను గుబులు

ABN, First Publish Date - 2022-12-07T00:05:10+05:30

వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో రైతుల్లో గుబులు నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కోతలు జరుగుతున్నాయి. వెనుక ఉబాలు జరిగిన ప్రాంతాల్లో ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు.

పొలంలో కుప్పలు పెడుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తుపాను గుబులు

కోసిన వరిని సంరక్షించేందుకు పాట్లు

రైతులకు తప్పని వ్యయప్రయాసలు

టెక్కలి/నరసన్నపేట, డిసెంబరు 6: వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో రైతుల్లో గుబులు నెలకొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండగా మారనున్నట్టు వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రైతులు భయాందోళనకు గురవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కోతలు జరుగుతున్నాయి. వెనుక ఉబాలు జరిగిన ప్రాంతాల్లో ఒకటి, రెండు రోజుల్లో ప్రారంభించనున్నారు. ఇటువంటి తరుణంలో వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు సంభవించడంతో రైతులు పొలాలకు పరుగులుతీశారు. కోసిన పంటను సంరక్షించే పనిలో పడ్డారు. అయితే ఎక్కువ మంది రైతులు యంత్రాలతో నూర్పులు చేస్తున్నారు. దీంతో నేరుగా ధాన్యం కల్లాల్లోకి చేరుతున్నాయి. మరోవైపు కాలువ, నదీ పరీవాహక ప్రాంతాల్లో పొలాల్లో ఇంకా నీటి తడులు ఉన్నాయి. అటువంటి చోట ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. సంప్రదాయ పద్ధతిలో కోసి వరిచేను ఎండిన తరువాత కుప్పలు పెట్టాల్సి ఉంటుంది. అయితే మారిన వాతావరణంతో పచ్చిగా ఉన్న పైరును కుప్పలుగా పెట్టాల్సి వస్తోంది. చివరకు దగ్గరగా ఉన్న రహదారులపై కుప్పలు పెడుతున్నారు. మరికొందరైతే సుదూర ప్రాంతాల్లో సంరక్షించడానికి వ్యయప్రయాసలకు గురవుతున్నారు. మరోవైపు 9,10 తేదీల్లో తుపాను ప్రభావం అధికంగా ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో వ్యవసాయ శాఖ అప్రమత్తమైంది. వీలైనంత వరకూ కోతలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే ధాన్యం పక్వానికి వచ్చింది. వర్షంతో పాటు చిన్నపాటి గాలివీచినా వరి వర్షార్పణమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తుపాను ముప్పు నుంచి తప్పించాలని వరుణదేవుడిని వేడుకుంటున్నారు.

Updated Date - 2022-12-07T00:05:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising