ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాకుళం జిల్లా: మరో ఉద్ధానంగా కిట్టాలపాడు

ABN, First Publish Date - 2022-03-12T17:54:57+05:30

శ్రీకాకుళం జిల్లా: టెక్కలి మండలం, కిట్టాలపాడు గ్రామంలో 90 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం జిల్లా: టెక్కలి మండలం, కిట్టాలపాడు గ్రామంలో 90 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామస్తులంతా కూలిపనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తుంటారు. ఇప్పుడు ఈ గ్రామంపై కిడ్నీ వ్యాధి విరుచుకుపడింది. మరో ఉద్దానంగా మారింది. ఏ తలుపు తట్టినా.. అనారోగ్య సమస్యలతో ఆర్తనాధాలు వినిపిస్తున్నాయి. కిడ్నీ సంబంధిత వ్యాధితో కొన్ని నెలల వ్యవధిలోనే పదుల సంఖ్యలో గ్రామస్తులు మృతి చెందారు.


ఐదేళ్లుగా కిట్టాలపాడు గ్రామాన్ని కిడ్నీ వ్యాధి పట్టి పీడుస్తోంది. ప్రతి ఇంట్లో ఒకరు అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కాళ్లు వాచిపోయి కదలలేని స్థితిలో చాలామంది మంచంపట్టారు. గ్రామంలో ఇప్పటికే కొందరు కిడ్నీ వ్యాధితో మృత్యువాత పడగా.. మరికొందరు డయాలసిస్ చేయించుకుంటున్నారు. ఈ మాయదారి రోగం ఎందుకు వచ్చిందో.. ఎప్పుడు పోతుందో తెలియక తల్లడిల్లుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించేవారి కోసం ఎదురుచూస్తున్నారు. వారానికొకరు గాల్లో కలుస్తుంటే.. దేవుడిపైనే భారం వేసి కాలం వెల్లదిస్తున్నారు.

Updated Date - 2022-03-12T17:54:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising