ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మార్కెట్‌కు శ్రావణ శోభ

ABN, First Publish Date - 2022-08-05T05:41:19+05:30

శ్రావణమాసం పురస్కరించుకుని.. గురువారం జిల్లావ్యాప్తంగా మార్కెట్లు కిటకిటలాడాయి. శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి అవసర మైన పూజాసామగ్రిని భక్తులు కొనుగోలు చేసుకున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్‌లోని పొట్టిశ్రీరాముల మార్కెట్‌, రైతుబజార్‌ రద్దీగా మారాయి.

శ్రీకాకుళంలో రద్దీగా పొట్టిశ్రీరాముల మార్కెట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నేడు వరలక్ష్మీ వ్రతం
 పెరిగిన పూజాసామగ్రి ధరలు
(శ్రీకాకుళం కల్చరల్‌)

శ్రావణమాసం పురస్కరించుకుని.. గురువారం జిల్లావ్యాప్తంగా మార్కెట్లు కిటకిటలాడాయి.  శుక్రవారం వరలక్ష్మి వ్రతానికి అవసర మైన పూజాసామగ్రిని భక్తులు కొనుగోలు చేసుకున్నారు. శ్రీకాకుళం పాతబస్టాండ్‌లోని పొట్టిశ్రీరాముల మార్కెట్‌, రైతుబజార్‌ రద్దీగా మారాయి. ఎన్నడూలేనంతగా పూజాసామగ్రితో పాటు పండ్లు, పూల ధరలు అమాంతం పెరిగాయి. అరటి పండ్లు డజను రూ.90, ఆపిల్‌, బత్తాయి, దానిమ్మ పండ్లు కిలో రూ.200 చొప్పున విక్రయించారు. బంతి, చామంతి పూలు 100 గ్రాములు రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయించారు. దీంతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాల వారు ఇబ్బందులు పడ్డారు. అయితే పూజలు దృష్ట్యా కొనుగోలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితి. గత మూడేళ్లుగా కొవిడ్‌ ప్రభావం ఉండడంతో ఆంక్షలు సాగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఘనంగా వరలక్ష్మి వ్రతం నిర్వహించేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. శక్తికొలది బంగారం ఆభరణాలు, నూతన వస్త్రాలను కొనుగోలు చేశారు.


Updated Date - 2022-08-05T05:41:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising