ఘనంగా కాలభైరవునికి ప్రత్యేక పూజలు
ABN, First Publish Date - 2022-12-16T23:20:56+05:30
స్థానిక నీలకంఠేశ్వరుని ఆలయ ప్రాంగణంలోని కాలభైరవ ఆలయ వార్షికోత్సవం శుక్ర వారం నిర్వహించారు.
పాతపట్నం: స్థానిక నీలకంఠేశ్వరుని ఆలయ ప్రాంగణంలోని కాలభైరవ ఆలయ వార్షికోత్సవం శుక్ర వారం నిర్వహించారు. ఏటా మార్గశిర బహుళ అష్టమి నాడు కాలభైరవ జయంతిని నిర్వహిస్తుంటారు. ఇందు లో భాగంగా కాలభైరవునికి అభిషేకం చేసి వడలు, నిమ్మకాయల మాలలతో అలకంరించారు. అర్చకులు కళ్యాణస్వామి, తేజ స్వామి, బుజ్జి స్వామి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్ర మంలో పలువురు స్థానికులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:20:57+05:30 IST