ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గృహ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి

ABN, First Publish Date - 2022-01-18T05:33:10+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో యాభై శాతం గృహాలను జులై 31నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కమిషనర్‌ రాహుల్‌పాండే అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి గృహ నిర్మాణాల ప్రగతిపై ఆయన సమీక్షించారు.

మాట్లాడుతున్న హౌసింగ్‌ ప్రత్యేక కమిషనర్‌ రాహుల్‌పాండే
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- జూలై 31 నాటికి యాభై శాతం పూర్తి చేయండి

- రాష్ట్ర గృహనిర్మాణశాఖ ప్రత్యేక కమిషనర్‌ రాహుల్‌ పాండే

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, జనవరి 17 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో యాభై శాతం గృహాలను జులై 31నాటికి పూర్తిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కమిషనర్‌ రాహుల్‌పాండే అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఇంజనీరింగ్‌ అధికారులతో కలిసి గృహ నిర్మాణాల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. తొలివిడత రాష్ట్రంలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. జిల్లాలో 91,660 ఇళ్లు మంజూరు చేయగా, ఇప్పటివరకు 20 శాతం ఇళ్లకు బేసిమెంట్‌ స్థాయిలో పనులు ప్రారంభమయ్యాయన్నారు. జూలై నెలాఖరు నాటికి 50 శాతానికి పైగా గృహ నిర్మాణాలు పూర్తిచేయాలని స్పష్టం చేశారు.  ఇళ్ల నిర్మాణాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. సొంత స్థలాలు కలిగిన వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని.. నిర్మాణాలకు నిధులు కొరత లేదని తెలిపారు. నిర్మాణాలకు అవసరమైన సిమెంట్‌, ఐరన్‌, ఇసుక కూడా సిద్ధంగా ఉన్నాయని వివరించారు.  ఈ సమావేశంలో జేసీ శ్రీనివాసులు, హౌసింగ్‌ పీడీ గణపతి, ఇంజనీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-18T05:33:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising