ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్మార్ట్‌.. టికెట్‌

ABN, First Publish Date - 2022-10-18T04:48:01+05:30

ప్రజా రవాణా సంస్థగా ఉన్న ఆర్టీసీ.. నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. సాంకేతికతకు అనుగుణంగా.. సాధారణ టిక్కెట్ల స్థానంలో స్మార్ట్‌ టికెటింగ్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. చిల్లర సమస్య లేకుండా.. నగదు రహిత లావాదేవీలకు చర్యలు చేపడుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఆర్టీసీలో నూతన విధానం
- ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, అలా్ట్ర డీలక్స్‌, ఏసీ బస్సుల్లో అమలు
- నగదు రహిత లావాదేవీలకు చర్యలు
(టెక్కలి రూరల్‌)

ప్రజా రవాణా సంస్థగా ఉన్న ఆర్టీసీ.. నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. సాంకేతికతకు అనుగుణంగా.. సాధారణ టిక్కెట్ల స్థానంలో స్మార్ట్‌ టికెటింగ్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చింది. చిల్లర సమస్య లేకుండా.. నగదు రహిత లావాదేవీలకు చర్యలు చేపడుతోంది. జిల్లాలోని టెక్కలి, పలాస, శ్రీకాకుళం-1,2 డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో ఓపీఆర్‌ఎస్‌ (ఆన్‌లైన్‌ ప్యాసింజర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌) అమలులో ఉండగా.. దూరప్రాంత సర్వీసులకు యూటీఎస్‌(యూనిఫైడ్‌ టిక్కెట్‌ సొల్యూషన్స్‌) విధానం ద్వారా ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు టికెట్‌లను అందజేస్తున్నారు. సుమారు 50 ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులతోపాటు ఇచ్ఛాపురం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, రామచంద్రాపురం, రాజమహేంద్రవరం, భద్రాచలం, విజయవాడ తదితర సుమారు 45 దూరప్రాంత సర్వీసుల బస్సుల్లో నూతన స్మార్ట్‌ టికెటింగ్‌ విధానం అమలు చేస్తున్నారు. ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, అల్ర్టాడీలక్స్‌, ఏసీ బస్సుల్లో ప్రారంభించిన ఈ నూతన విధానం.. ఈ నెల 24 నుంచి పూర్తిస్థాయిలో అమలు చేయనున్నట్టు ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. గ్రామస్థాయిల్లో పల్లె వెలుగు బస్సుల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.  

సిబ్బందికి అవగాహన
స్మార్ట్‌ మిషన్ల వినియోగంపై ఆర్టీసీ అధికారులు సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నారు. స్మార్ట్‌ మిషన్ల ఛార్జింగ్‌కు అనుకూలంగా చర్యలు చేపట్టారు. నూతన యూటీఎస్‌ మిషన్లు అమలుతో ఇక.. ఆర్టీసీ బస్సుల్లో నగదు రహిత లావాదేవీలు సైతం అందుబాటులోకి రానున్నాయి. యూటీఎస్‌ యంత్రాలలో ఏటీఎం కార్డు స్వైపింగ్‌, ఫోన్‌పే, గూగుల్‌పే, పేటీఎంతో పాటు క్యూఆర్‌ కోడ్‌ పద్ధతుల ద్వారా నగదు రహిత లావాదేవీలకు సౌకర్యం కల్పించారు. దూరప్రాంత ప్రయాణికుల స్టేజ్‌ టు స్టేజ్‌ రిపోర్టు సిబ్బందికి అందుబాటులోకి రానుంది. దీంతో మిగతా ఖాళీ సీట్లకు సంబంధించి ప్రయాణికులకు బస్సులోనే రిజర్వేషన్‌ కల్పించవచ్చు. స్మార్ట్‌ టికెటింగ్‌.. పూర్తిగా టచ్‌స్ర్కీన్‌ విధానం కావడంతో సౌలభ్యంగా ఉంటుందని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. చిల్లర సమస్య కూడా ఉండదని భావిస్తున్నారు.  

అమలు చేస్తున్నాం
జిల్లాలోని శ్రీకాకుళం, టెక్కలి, పలాస డిపోల పరిధిలోని ఎక్స్‌ప్రెస్‌, డీలక్స్‌, సూపర్‌లగ్జరీ, అలా్ట్రడీలక్స్‌, ఏసీ సర్వీసుల బస్సుల్లో స్మార్ట్‌ టికెటింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. సిబ్బందికి నూతన విధానంపై అవగాహన కల్పిస్తున్నాం. త్వరలో పల్లెవెలుగు బస్సుల్లో సైతం స్మార్ట్‌ టికెటింగ్‌ విధానం అమలుకు చర్యలు చేపడుతున్నాం.  
- ఏ.విజయ్‌ కుమార్‌, డీపీటీఓ, శ్రీకాకుళం.

 

Updated Date - 2022-10-18T04:48:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising