ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు జేఎల్‌ఎంలకు షోకాజ్‌

ABN, First Publish Date - 2022-03-06T03:49:40+05:30

సచివాలయాల్లోని జేఎల్‌ఎంలు విధి నిర్వహణలో నిర్లక్ష్యం, హాజరు, మూమెంట్‌ రిజిస్టర్లలో సంతకాలు చేయకపోవడంపై సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం తలతరియా, నగిరికటకం, మర్రివలస గ్రామ సచివాలయాలను ఆయన సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధులకు హాజరై కూడా హాజరు పట్టీ, మూమెంట్‌ రిజిస్టర్లలో సంతకం చేయని తలతరియా, నగరికటకం జేఎల్‌ఎంలు సూర్యనారాయణ, బి.కృష్ణలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయ సి

తలతరియా సచివాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న టెక్కలి సబ్‌ కలక్టర్‌ వికాస్‌ మర్మట్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


విఽధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
 టెక్కలి సబ్‌కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌
జలుమూరు, మార్చి 5:
సచివాలయాల్లోని జేఎల్‌ఎంలు విధి నిర్వహణలో నిర్లక్ష్యం, హాజరు, మూమెంట్‌ రిజిస్టర్లలో సంతకాలు చేయకపోవడంపై సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం తలతరియా, నగిరికటకం, మర్రివలస గ్రామ సచివాలయాలను ఆయన సందర్శించి రికార్డులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విధులకు హాజరై కూడా హాజరు పట్టీ, మూమెంట్‌ రిజిస్టర్లలో సంతకం చేయని తలతరియా, నగరికటకం జేఎల్‌ఎంలు సూర్యనారాయణ, బి.కృష్ణలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సచివాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులకు అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఓటీఎస్‌ వసూలు వేగవంతం చేయాలని సూచించారు. జగనన్న కాలనీల నిర్మాణ పనులు నత్తనడకన సాగుతుండడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనతో పాటు తహసీల్దారు జె.ఈశ్వరమ్మ, డీటీ పి.శ్రీనివాసరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
డిప్యూటీ వార్డెన్‌ సస్పెన్షన్‌
సీతంపేట మండలం పొల్ల గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాల డిప్యూటీ వార్డెన్‌ చిరంజీవిని సస్పెండ్‌చేస్తూ ఐటీడీఏ పీవో ఉత్తర్వులు జారీ చేశారని గిరిజన సంక్షేమ శాఖ సంచాలకురాలు ఎం.కమల తెలిపారు.  ఈనెల 2న పొల్ల ఆశ్రమ పాఠశాలకు చెందిన ఐదో తరగతి విద్యార్థి ఎం.ప్రవీణ్‌ విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన విషయం తెలిసిందే. పర్యవేక్షణ లోపం వల్ల ఆ విద్యార్థి బయటకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడని.. ఈ నేపథ్యంలో డిప్యూటీ వార్డెన్‌ను  సస్పెండ్‌ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే పీఎంఆర్‌సీ ఓఎస్‌డీ విచారణ నిర్వహిస్తున్నారని, పూర్తి నివేదిక వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా, విద్యార్థి ప్రవీణ్‌ కుటుంబానికి రూ.15లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని సీపీఐ,  ఏఐవైఎఫ్‌, గిరిజన సంఘం నాయకులు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


Updated Date - 2022-03-06T03:49:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising