ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేశ ఐక్యతను చాటాలి

ABN, First Publish Date - 2022-10-31T23:38:40+05:30

దేశ ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పాలని.. అదే ఏక్తా రన్‌ ఉద్దేశమని ఎస్పీ జీఆర్‌ రాధిక అన్నారు. సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలో ‘రాష్ట్రీయ ఏక్తారన్‌’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.

ఏక్తా రన్‌లో ప్రతిజ్ఞ చేస్తున్న ఎస్పీ రాధిక
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశ ఐక్యతను చాటాలి

ఏక్తారన్‌లో ఎస్పీ రాధిక

శ్రీకాకుళం, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): దేశ ఐక్యతను ప్రపంచానికి చాటిచెప్పాలని.. అదే ఏక్తా రన్‌ ఉద్దేశమని ఎస్పీ జీఆర్‌ రాధిక అన్నారు. సర్దార్‌ వల్లబాయ్‌ పటేల్‌ జయంతి సందర్భంగా సోమవారం శ్రీకాకుళంలో ‘రాష్ట్రీయ ఏక్తారన్‌’ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ, నెహ్రూ యువ కేంద్రం, జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డేఅండ్‌నైట్‌ జంక్షన్‌ నుంచి కేఆర్‌ స్టేడియం వరకు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తొలి హోంశాఖ మంత్రిగా, ఉప ప్రధానిగా సర్దార్‌ పటేల్‌ దేశ ఐక్యతకు చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. ఐకమత్యంతో ఎంతటి కార్యాన్నైనా సాధించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా క్రీడాకారులు, విద్యార్థులు, అఽధికారులు దేశసమగ్రత, ఐక్యతపై ప్రతిజ్ఞ చేశారు. సోమవారం రాత్రి పోలీసులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. దేశభక్తి గీతాలతో ర్యాలీ చేపట్టారు. ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద మానవహారంగా నిలిచారు. కార్యక్రమంలో డీఎస్‌డీవో మాఽధురీలత, ఎన్‌వైసీ జిల్లా సమన్వయకర్త ఉజ్వల్‌, జిల్లా యువజన సర్వీసుల శాఖ సీఈవో ప్రసాదరావు, ఏఎస్పీలు శ్రీనివాసరావు, టీపీ విఠలేశ్వర్‌, డీఎస్పీలు, సీఐలు తదితరులు పాల్గొన్నారు.

11111111111111111111111111

Updated Date - 2022-10-31T23:38:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising