ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలి

ABN, First Publish Date - 2022-06-28T05:41:28+05:30

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని పరిశ్రమల శాఖ ఏడీ ఉమామహేశ్వరరావు కోరారు.

మాట్లాడుతున్న పరిశ్రమలశాఖ ఏడీ ఉమామహేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50




  ఏడీ ఉమామహేశ్వరరావు 

అరసవల్లి, జూన్‌ 27: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమల స్థాపనకు ముందుకు రావాలని పరిశ్రమల శాఖ ఏడీ ఉమామహేశ్వరరావు కోరారు. అంతర్జాతీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్‌ఎం) పరిశ్రమల దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆ శాఖ కార్యాలయంలో అధికారు లు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన సమా వేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ఈఓడీబీ ద్వారా 1 నుంచి 21 పని దినాల్లో సింగిల్‌ డెస్క్‌ పాలసీలో అనుమతులు ఇస్తుందని తెలిపారు. ఎటువంటి ఆలస్యం జరగకుండా ప్రతినెలా ఇండస్ట్రీస్‌ అండ్‌ ఎక్స్‌పోర్ట్స్‌ ప్రమోషన్‌ కమిటీ ద్వారా  ఎన్డీపీ పనితీరును సమీక్షిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. జిల్లాలో రైస్‌మిల్లులు, గ్రానైట్‌ పాలిషింగ్‌, ఫార్మా, జీడిపప్పు, మొదలగు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు మొత్తం 600 వరకు ఉన్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీలు కోటి రూపాయల వరకు పరిశ్రమలు పెట్టుకోవ చ్చని, సైడ్‌ సర్వీసుల స్థాపనకు రూ.75 లక్షల వరకు అనుమతి ఉందని  తెలిపారు. జిల్లాలో కొత్త పారిశ్రామిక వాడల స్థాపనకు కలెక్టర్‌ సహకారంతో పలాస, పైడి భీమవరం, తదితర ప్రాంతాల్లో ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. ఏపీఐడీసీ డైరెక్టర్‌  అనూరాధ మా ట్లాడుతూ.. పరిశ్రమలను స్థాపించి 75 శాతం స్థానికులకు ఉద్యోగ, మార్కెటింగ్‌ అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ రామారావు మాట్లాడు తూ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు చిన్న, మధ్యతరహా పారిశ్రామికవే త్తలుగా ఎదగాలన్నారు. ఐతం ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ విష్ణుమూర్తి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పథకాలను వినియోగించుకుని పరిశ్రమలను స్థాపించాలని కోరారు.  యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా చీఫ్‌ మేనేజర్‌ మాట్లాడుతూ.. పదిమంది ఒక గ్రూపుగా ఏర్పడి వస్తే రుణం మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్టరీల అధికారి సత్యనారాయణ, పరిశ్ర మలశాఖ ఏడీవీ రఘునాథ్‌, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు.  




 


Updated Date - 2022-06-28T05:41:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising