సీజనల్ వసతి గృహాలు ఏర్పాటు చేయాలి
ABN, First Publish Date - 2022-12-07T23:58:03+05:30
జిల్లాలో సీజనల్ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల బయట పిల్లల కోసం సీజనల్ వసతి గృహాలు అవసరమని చెప్పారు.
శ్రీకాకుళం,(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీజనల్ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లఠ్కర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాల బయట పిల్లల కోసం సీజనల్ వసతి గృహాలు అవసరమని చెప్పారు. వసతి గృహాల్లో రాత్రుళ్లు ఉంటున్న వారి వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలన్నారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, బీసీ వసతి గృహాల్లో విద్యార్థులు చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. మండలాల్లో సర్వే నిర్వహించి ఏ ప్రాంతంలో వలసలు వెళ్తున్నారన్నదీ గుర్తించి అక్కడ సీజనల్ వసతి గృహాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డీఈఓ పగడాలమ్మ, డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్, బీసీ వెల్ఫేర్ అధికారి గడ్డెమ్మ, ఎన్జీవో ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-07T23:58:05+05:30 IST