ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోగనున్న బడి గంట

ABN, First Publish Date - 2022-07-05T04:42:20+05:30

బడి గంట మోగనుంది. వేసవి సెలవుల అనంతరం మంగళవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 1763 ప్రాథమిక, 317 ప్రాథమికోన్నత, 301 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో 73,513 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో 40,944 మంది, ఉన్నత పాఠశాలలో 77,278 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా నేటి నుంచి బడిబాట పట్టనున్నారు.

టెక్కలిలో ప్రభుత్వ పాఠశాల
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేటి నుంచి పాఠశాలల పునఃప్రారంభం
(టెక్కలి రూరల్‌)

బడి గంట మోగనుంది. వేసవి సెలవుల అనంతరం మంగళవారం నుంచి పాఠశాలలు పున:ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లాలో 1763 ప్రాథమిక, 317 ప్రాథమికోన్నత, 301 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో 73,513 మంది, ప్రాథమికోన్నత పాఠశాలలో 40,944 మంది, ఉన్నత పాఠశాలలో 77,278 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా  నేటి నుంచి బడిబాట పట్టనున్నారు. విద్యాశాఖ క్యాలెండర్‌కు అనుగుణంగా పాఠశాలలు, కార్యక్రమాల నిర్వహణకు అధికారులు సమాయత్తమవుతున్నారు. పుస్తకాలు, విద్యాకానుక కిట్లు సిద్ధం చేస్తున్నారు. ‘జగనన్న గోరుముద్ద’ అమలులో అధికారులు ఈ ఏడాది చిన్నపాటి మార్పులు చేశారు. అలాగే చాలా పాఠశాలల్లో ‘నాడు-నేడు’  పనులు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి నెలకొంది. కాగా, ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలో విలీన ప్రక్రియ చర్చనీయాంశమవుతోంది. మరోవైపు పాఠశాలల నిర్వహణ, మధ్యాహ్న భోజనం, పారిశుధ్యం వంటి అంశాల పర్యవేక్షణకు పలువురు సచివాలయ సిబ్బందికి అదనపు భాద్యతలను అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ విధానంపై ఉపాధ్యాయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనివల్ల పాఠశాలలపై సచివాలయ సిబ్బంది అజమాయిషీ పలికే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
 
 

Updated Date - 2022-07-05T04:42:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising