ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అధికార సేవలో ‘ఆర్టీసీ’

ABN, First Publish Date - 2022-12-07T00:08:47+05:30

లా ప్రజా రవాణా (ఆర్టీసీ) ‘అధికార’ సేవలో తరిస్తోంది. మూడు వారాల వ్యవధిలో మూడు కార్యక్రమాలతో ప్రజా జీవనం స్తంభించింది. తాజాగా విజయవాడలో తలపెట్టిన బీసీగర్జనకు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 83 బస్సులను కేటాయించారు. సుదూర ప్రయాణకం కావడం, ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమం కావడంతో దాదాపు కండీషన్‌లో ఉన్న బస్సులను కేటాయించారు.

టెక్కలి కాంప్లెక్స్‌లో బస్సుల కోసం వేచివున్న ప్రయాణికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికార సేవలో ‘ఆర్టీసీ’

విజయవాడ బీసీ గర్జనకు 83 బస్సులు

ప్రధాన సర్వీసులు రద్దుచేసి మళ్లింపు

జిల్లా వ్యాప్తంగా స్తంభించిన రవాణా వ్యవస్థ

నెలరోజుల్లో ఇది మూడోసారి

ప్రజారవాణా అధికారుల తీరుపై విమర్శలు

(టెక్కలి)

- గత నెల 12న ప్రధాని మోదీ విశాఖ పర్యటనకు వచ్చారు. కేంద్ర పథకాల ప్రారంభానికి వచ్చినా.. వైసీపీ నేతలు ప్రధాని పర్యటనను ప్రతిష్ఠాత్మంగా తీసుకున్నారు. జిల్లా నుంచి భారీగా జన సమీకరణ చేశారు. దాదాపు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 70 శాతం బస్సులు జనాల తరలింపునకు వినియోగించారు. దీంతో ప్రజా రవాణా స్తంభించింది. ప్రజలకు ప్రయాణ వెతలు తప్పలేదు.

- గత నెల 23న సీఎం జగన్‌ నరసన్నపేటలో పర్యటించారు. అదే రోజు సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. నియోజకవర్గంలోని నాలుగు మండలాతో పాటు ఆమదాలవలస, టెక్కలి నియోజకవర్గాల నుంచి జనాలను భారీగా తరలించారు. ఇందుకుగాను ఆర్టీసీ బస్సులను వినియోగించారు. ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించి మరీ బస్సులను సీఎం టూర్‌కు ఉపయోగించుకున్నారు.

- విజయవాడలో బుధవారం ప్రభుత్వం ‘బీసీ గర్జన’కు తలపెట్టింది. ఇందుకుగాను జిల్లాకు 83 బస్సులు కేటాయించారు. ఉన్నవే 308 బస్సులు. అందులో కాలం చెల్లినవే 20 శాతం వరకూ ఉంటాయి. దీంతో సుదూర ప్రాంతాల సర్వీసులను రద్దుచేసి మరీ విజయవాడ మళ్లించారు. ప్రజా రవాణాకు తీవ్ర విఘాతం కలిగించారు.

- ఇలా ప్రజా రవాణా (ఆర్టీసీ) ‘అధికార’ సేవలో తరిస్తోంది. మూడు వారాల వ్యవధిలో మూడు కార్యక్రమాలతో ప్రజా జీవనం స్తంభించింది. తాజాగా విజయవాడలో తలపెట్టిన బీసీగర్జనకు జిల్లాలోని నాలుగు డిపోల నుంచి 83 బస్సులను కేటాయించారు. సుదూర ప్రయాణకం కావడం, ప్రభుత్వం నిర్దేశించిన కార్యక్రమం కావడంతో దాదాపు కండీషన్‌లో ఉన్న బస్సులను కేటాయించారు. మంగళవారం ఉదయానికే ఈ బస్సులు తమకు కేటాయించిన ప్రాంతాలకు వెళ్లాయి. దీంతో బస్సుల కోసం బస్టాండ్లలో, కాంప్లెక్స్‌ల్లో వేచిచూడడం ప్రయాణికుల వంతైంది. సూదర ప్రాంత సర్వీసులను రద్దుచేసి మళ్లించారు. వాటి స్థానంలో పల్లెవెలుగులను తిప్పారు. దీంతో గ్రామీణ సర్వీసులు పూర్తిగా లేకుండా పోయింది. ఎంక్వయిరీ విభాగంలో వాకబు చేస్తే ‘ఈరోజు విజయవాడలో బీసీ గర్జన ఉంది. బస్సులన్నీ మళ్లించారు’ అని చెప్పడంతో ఖంగుతిన్నారు. జిల్లాలో ప్రజారవణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. అత్యవసర, అనారోగ్య సమయాల్లో పనిమీద బయటకు వచ్చిన వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.

శుభకార్యాల సీజన్‌..

ప్రస్తుతం శుభకార్యాల సీజన్‌. వివాహాలు, గృహప్రవేశాలు, ఇతర కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ తరుణంలో బస్సుల మళ్లింపుతో ప్రజలు అసౌకర్యానికి గురయ్యారు. విశాఖకు వైద్యం కోసం బయలుదేరిన వారు సైతం ఇబ్బందులుపడ్డారు. పలాస, సోంపేట, ఇచ్ఛాపురం, నరసన్నపేట, శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లో ప్రయాణికులు పడిగాపులు కాయడం కనిపించింది. విశాఖ, రాజమండ్రి, రావులపాలేం, కాకినాడ ఇలా సుదూర ప్రాంతాల సర్వీసులను రద్దు చేయడంతో ముందస్తు ప్రయాణాలకు ఏర్పాట్లు చేసుకున్నవారు అవస్థలు పడ్డారు. రైళ్లపై ఆధారపడ్డారు. మరికొందరు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు. విద్యార్థులకు ఇక్కట్లు తప్పలేదు. చేతిలో రాయితీ పాసు ఉన్నా.. ప్రైవేటు వాహనాల్లో వెళ్లాల్సి వచ్చింది. బుధవారం కూడా ఇదే పరిస్థితి కొనసాగనుంది.

ఇబ్బందులు లేకుండా..

విజయవాడలోని బీసీ గర్జనకు బస్సులు మళ్లించడం వాస్తవమే. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏర్పాటుచేశాం. అయినా ఉన్న బస్సులతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. ప్రధాన రూట్లలో ప్రయాణికులకు అసౌకర్యం కలుగకుండా సర్వీసులను ఏర్పాటుచేశాం.

-శ్రీనివాసరావు, మేనేజర్‌, టెక్కలి డిపో

===================================

జిల్లాలో నాలుగు డిపోల్లో ఉన్న బస్సులు : 308

విజయవాడ బీసీ గర్జనకు తరలించినవి :83

శ్రీకాకుళం 1 డిపో నుంచి : 19

శ్రీకాకుళం 2 డిపో నుంచి : 25

పలాస డిపో నుంచి : 15

టెక్కలి డిపో నుంచి : 24

===================================

Updated Date - 2022-12-07T00:08:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising