ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూటు మార్చిన సారాసురులు!

ABN, First Publish Date - 2022-01-26T04:21:02+05:30

రూటు మార్చిన సారాసురులు!

పోలీసులు స్వాధీనం చేసుకున్న సారా ప్యాకెట్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సముద్ర మార్గంలో సరుకు రవాణా

కొత్తపాలెం తీరంలో పట్టుబడిన 6000 ప్యాకెట్లు

కవిటి, జనవరి 25 : సారా వ్యాపారులు రూటు మార్చారు. రోడ్డు రవాణాపై అధికారుల నిఘా పెరగడంతో సముద్ర మార్గాన్ని ఎంచుకున్నారు. ఒడిశా నుంచి బోట్లు, పడవల్లో ఆంధ్రాకు సారా తరలించి... సొమ్ము చేసుకుంటున్నారు. స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌బ్యూరో, పోలీస్‌ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన దాడుల్లో సోమవారం అర్ధరాత్రి కవిటి మండలం కొత్తపాలెం తీరంలో 600 లీటర్ల (ఆరువేల ప్యాకెట్లు)నాటు సారా పట్టుబడింది. ఒడిశాలోని నువగాం నుంచి సారా తెస్తుండగా.. ముందస్తు సమాచారం మేరకు దాడిచేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఈబీ ఏఎస్‌పీ శ్రీనివాసరావు, జేడీ గోపాల్‌ మాట్లాడుతూ పట్టుబడిన సారా విలువ రూ.1.20 లక్షలు ఉంటుందని చెప్పారు. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. చేపల వేట మాటున సారా రవాణా సాగుతోందన్నారు. ఈ దాడుల్లో పాల్గొన్న ఎస్‌ఈబీ అధికారులు వెంకాల అప్పలనాయుడు, ఇంటెలిజెన్స్‌ సీఐ మురళి, పలాస డీటీఎఫ్‌ సీఐ సతీష్‌కుమార్‌, శ్రీకాకుళం స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ మోహన్‌, సోంపేట స్పెషల్‌ బ్రాంచ్‌ ఎస్‌ఐ రమణ, కవిటి ఎస్‌ఐ జి.అప్పారావులను అభినందించారు. 

Updated Date - 2022-01-26T04:21:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising