ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోగిన పెళ్లిబాజా

ABN, First Publish Date - 2022-08-01T06:01:11+05:30

అంతటా శ్రావణ శోభ నెలకొంది. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాలకు సంబంధించి ముహూర్తాలు ఈ నెలలోనే అధికం. జూలై 29 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల 29 వరకూ కొనసాగనుంది. అమ్మవార్లకు ఈ నెల ప్రీతికరం. రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శుక్ర, శని, సోమవారాల్లో ఇష్ట దైవాలకు, కులదేవతలకు పూజలు చేస్తారు. వరలక్ష్మి, మంగళగౌరి, సంతోషిమాత, వైభవలక్ష్మి, దుర్గామాత, కన్యకాపరమేశ్వరి, సత్యనారాయణ వ్రతాలు జరుపు తారు. జంధ్యాల పౌర్ణమి, వేంకటేశ్వర స్వామి, ఆంజ నేయస్వామి, లక్ష్మీనరసింహస్వామి, షిర్డీ సాయిబాబా, అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఈమాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని చేయనున్నారు. అయితే ఈ నెల మొత్తం శుభ ముహూర్తాలు అధికం. 6,7,8,9,10,11,12,13 తేదీలో వివాహ ముహూర్తాలు, గృహ ప్రవేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తేదీల్లో వేలాది జంటలు ఒకటి కానున్నాయి. మరో నాలుగు నెలల పాటు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో ఎక్కువ మంది శ్రావణానికే మొగ్గుచూపారు. ఈ నెల 21 వరకూ శుభకార్యాలు కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు. ముందస్తు ఏర్పాట్లు ప్రస్తుతం వర్షాలు పడుతుం

పూలతో తయారుచేసిన పెళ్లి మండపం.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఈ నెలలో శుభ ముహూర్తాలు అధికం

అటు శ్రావణం.. ఇటు వివాహాల సందడి

(టెక్కలి)

అంతటా శ్రావణ శోభ నెలకొంది. మరోవైపు పెళ్లిళ్లు, శుభకార్యాలకు సంబంధించి ముహూర్తాలు ఈ నెలలోనే అధికం. జూలై 29 నుంచి శ్రావణ మాసం ప్రారంభమైంది. ఈ నెల 29 వరకూ కొనసాగనుంది. అమ్మవార్లకు ఈ నెల ప్రీతికరం. రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. శుక్ర, శని, సోమవారాల్లో ఇష్ట దైవాలకు, కులదేవతలకు పూజలు చేస్తారు. వరలక్ష్మి, మంగళగౌరి, సంతోషిమాత, వైభవలక్ష్మి, దుర్గామాత, కన్యకాపరమేశ్వరి, సత్యనారాయణ వ్రతాలు జరుపు తారు. జంధ్యాల పౌర్ణమి, వేంకటేశ్వర స్వామి, ఆంజ నేయస్వామి, లక్ష్మీనరసింహస్వామి, షిర్డీ సాయిబాబా, అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు చేస్తారు.  ఈమాసంలో వచ్చే రెండో శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని చేయనున్నారు. అయితే ఈ నెల మొత్తం శుభ ముహూర్తాలు అధికం. 6,7,8,9,10,11,12,13 తేదీలో వివాహ ముహూర్తాలు, గృహ ప్రవేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ తేదీల్లో వేలాది జంటలు ఒకటి కానున్నాయి. మరో నాలుగు నెలల పాటు వివాహ ముహూర్తాలు లేకపోవడంతో ఎక్కువ మంది శ్రావణానికే మొగ్గుచూపారు. ఈ నెల 21 వరకూ శుభకార్యాలు కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు. 


 ముందస్తు ఏర్పాట్లు

ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో ఎక్కువ మంది కళ్యాణ మండపాలను ఆశ్రయిస్తున్నారు. దీంతో వాటికి గిరాకీ ఏర్పడింది. కొందరు దేవాలయాలు, కమ్యూనిటీ హాళ్ల నిర్వాహకులతో ముందస్తుగానే మాట్లాడుకున్నారు. గ్రామాల్లో అయితే వర్షాలు దృష్ట్యా వివాహాల నిర్వాహకులు ముందస్తు ఏర్పాట్లు చేసుకున్నారు. వాటర్‌ ప్రూఫ్‌ షామియానా పద్ధతులను అనుసరిస్తున్నారు.. ఓవైపు గృహప్రవేశాలు, మరోవైపు పెళ్లిల్లు మూలంగా పురోహితులు, మేళతాళాలు, శంకధ్వని, బ్యాండ్‌పార్టీలు, షామియానా సప్లయర్స్‌, లైటింగ్స్‌, డెకరేషన్స్‌, పెళ్లి మండపాల పూల డెకరేషన్లు, వీడియోగ్రాఫర్లు, ఫొటోగ్రాఫర్లు, ఈవెంట్‌ ఆర్గనైజర్లు, వాహనాలు, కిరాణా దుకాణాలు, మిఠాయి దుకాణాలు, వంట వారికి చేతినిండా పనే. అటు శ్రావణ శోభ.. ఇటు శుభకార్యాలతో సందడి వాతావరణం నెలకొంది.



Updated Date - 2022-08-01T06:01:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising