బెల్లం విక్రయాల నమోదు తప్పనిసరి: ఎస్పీ
ABN, First Publish Date - 2022-05-15T05:28:40+05:30
దుకాణాల్లో బెల్లం విక్రయాల నమోదు తప్పనిసరిగా చేయాలని ఎస్పీ జీఆర్ రాధిక అన్నారు.
ఎచ్చెర్ల, మే 14: దుకాణాల్లో బెల్లం విక్రయాల నమోదు తప్పనిసరిగా చేయాలని ఎస్పీ జీఆర్ రాధిక అన్నారు. ఎచ్చెర్ల సాయుధ పోలీసు కమ్యూ నిటీ హాల్లో శనివారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో బెల్లం విక్రయాలు జరిపే హోల్సేల్, రిటైల్ విక్రయదారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల ఆరోగ్యా నికి హాని చేసే నాటుసారా తయారీకి బెల్లం, ఇతర ముడిసరుకులు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. బెల్లం విక్రయదారులపై ప్రత్యేక నిఘా వేసి, ఎప్పటి కప్పుడు వివరాలు సేకరించాలన్నారు. నిబంధనల కు వ్యతిరేకంగా వ్యహరించిన వారిపై పీడీ యాక్ట్, ఎక్సైజ్ చట్టం ప్రకారం కేసులు నమోదుచేస్తామని హెచ్చరించారు. జిల్లాలో నాటుసారా సమూలంగా నిర్మూలించేందుకు అందరూ సహకరించాలన్నారు. నాటుసారా తయారీలో నల్ల బెల్లం విక్రయానికి ఆర్ధ్థిక సాయం చేసిన వారిపై చర్యలు తప్పవన్నారు. ఈ సమా వేశంలో అదనపు ఎస్పీ కె.శ్రీనివాసరావు,సీఐ అంబేడ్కర్, ఈశ్వర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-05-15T05:28:40+05:30 IST