ట్రిపులో ఐటీల్లో 650 బోధనా పోస్టుల భర్తీ
ABN, First Publish Date - 2022-10-08T04:51:02+05:30
రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో రెగ్యులర్ ప్రాతిప దికన త్వరలో 650 బోధనా పోస్టులు భర్తీ చేస్తామని చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్(శ్రీకాకుళం)ను ఆయన సందర్శించి మాట్లాడారు.
త్వరలో నోటిఫికేషన్
ఆర్జీయూకేటీ చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి
ఎచ్చెర్ల, అక్టోబరు 7: రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పరిధిలోని నాలుగు ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌ల్లో రెగ్యులర్ ప్రాతిప దికన త్వరలో 650 బోధనా పోస్టులు భర్తీ చేస్తామని చాన్సలర్ ప్రొఫెసర్ కేసీ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఎచ్చెర్లలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్(శ్రీకాకుళం)ను ఆయన సందర్శించి మాట్లాడారు. ‘బోధనా పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్ పాయింట్ల నిర్ణయంపై సాంఘిక సంక్షేమ శాఖకు లేఖ రాశాం. దీనిపై స్పష్టత వచ్చిన వెంటనే నోటిఫికేషన్ విడుదల చేస్తాం. స్ర్కీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా పోస్టులను భర్తీ చేస్తాం. ఏపీపీఎస్సీ ద్వారా రెగ్యులర్ ప్రాతిపదికన 380 బోధనేతర పోస్టుల నియామకాన్ని చేపడతాం. 2022-23 విద్యా సంవత్సరానికి సంబంధించి అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేస్తున్నాం. శ్రీకాకుళం క్యాంపస్‌లో పీయూసీ రెండేళ్లు, ఇంజనీరింగ్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నాం. ఈ ఏడాది ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు కూడా ఇదే క్యాంపస్‌లోనే తరగతులు నిర్వహిస్తాం. వచ్చే రెండేళ్లలో ఆరు బ్యాచ్‌ల విద్యార్థులకు తరగతులు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశాం. శ్రీకాకుళం క్యాంపస్‌లో సీట్లు పొందిన విద్యార్థులకు ఈ నెల 15, 16 తేదీల్లో ఇదే క్యాంపస్‌లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. 17వ తేదీ నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామ’ని చాన్సలర్ కేసీ రెడ్డి తెలిపారు. ఆయన వెంట ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ పెద్దాడ జగదీశ్వరరావు, ఓఎస్డీ ప్రొఫెసర్ ఎల్డీ సుధాకర్ బాబు, ఎఫ్‌వో డాక్టర్ అశిరినాయుడు ఉన్నారు.
Updated Date - 2022-10-08T04:51:02+05:30 IST