ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
ABN, First Publish Date - 2022-12-15T23:42:33+05:30
ధాన్యం కొనుగోలు వేగవంత చేయాలని టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కూమార్ రెడ్డి తెలిపారు. గురువారం జలగలింగుపురంలో నిల్వ చేసిన ధాన్యాన్ని పరిశీలించారు.
మెళియాపుట్టి: ధాన్యం కొనుగోలు వేగవంత చేయాలని టెక్కలి సబ్ కలెక్టర్ రాహుల్ కూమార్ రెడ్డి తెలిపారు. గురువారం జలగలింగుపురంలో నిల్వ చేసిన ధాన్యాన్ని పరిశీలించారు. కౌలు రైతుల నుంచి కూడా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. ఈకేవైసీ అవ్వకపోవడంతో రైతులు ఖాతాల్లో డబ్బులు జమవుతున్నాయని, అలా జరగకుండా చూడాలని పలువురు కౌలు రైతులు కోరారు. మిల్లర్లు నుంచి ఇబ్బంది రాకుండా చేడాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించారు. తహసీల్దార్ పి.సరోజిని, పీఏసీఎస్ చైర్మన్ యు.బాలరాజు, ఏవో దానకర్ణుడు, సీఈవో వాసునాయుడు తదితరులు ఉన్నారు.
‘నిబంధనల మేరకే ధాన్యం తరలించండి’
జలుమూరు: ప్రభుత్వ నిబంధనల మేరకే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిప్యూటీ కలెక్టర్ బి.నారదాముని సూచించారు. పాగోడు గ్రామాన్ని గురువారం సందర్శించిన ఆయన ధాన్యం విక్రయాల్లో ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రైతు భరోసా కేంద్రాన్ని సందర్శించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ధాన్యం తేమ శాతంలో తేడాలు రాకుండా చూసుకోవాలని సిబ్బందికి సూచించారు. రైతులకు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తహసీల్దార్ పి.శ్రీనివాసరావు, సివిల్ సప్లై డీటీ గణేష్, ఏవో కె.సురేష్, సర్పంచ్ దామ మన్మధరావు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:42:34+05:30 IST