ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాలన చేతకాక చార్జీల బాదుడు

ABN, First Publish Date - 2022-07-03T06:31:40+05:30

పాలన చేతకాక చార్జీల బాదుడు

ఆర్టీసీ బస్సులో ప్రయాణికులతో మాట్లాడుతున్న ముద్దరబోయిన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బస్‌ చార్జీల పెంపుపై టీడీపీ నిరసన
నూజివీడు, జూలై 2: ముఖ్యమంత్రి జగన్మో హన్‌రెడ్డికి పరిపాలన చేతకాక, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం తెలియక, ప్రజలను చార్జీల పేరుతో బాదుతున్నారని టీడీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు విమర్శించారు. చార్జీల పెంపుపై ప్రయాణికుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి శనివారం నూజి వీడు నుంచి మీర్జాపురం గ్రామానికి ఆయన బస్సులో ప్రయాణించారు. టీడీపీ హయాంలో మీర్జాపురం నుంచి నూజివీడుకు రూ.10 ఉండేదని, ఇప్పుడు రూ.25 అయిందని ప్రయాణికులు ఆగ్రహం చేశారు. చార్జీలు పెంచినా వసతులు పెరగ లేదని, డిపోలు, బస్‌స్టేషన్లు మురికికూపంగా ఉన్నాయని, కార్మికులకు రిఫరల్‌ ఆస్పత్రుల వైద్య ం అందడం లేదని ముద్దర బోయిన అన్నారు. ముసునూరు రాజా, యన మదల నాని ఉన్నారు.



కైకలూరులో..
కైకలూరు: పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే తగ్గించాలని మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ డిమాండ్‌ చేశారు. వైసీపీ శనివారం కైక లూరు ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద బస్‌చార్జీల పెంపు నకు నిరసనగా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. బస్సులో ప్రయాణికులతో మాట్లా డారు. చార్జీల పెంపుతో ఇబ్బంది పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. సయ్యపు రాజు గుర్రాజు, దావు నాగరాజు, పళ్లెం ఏడు కొండలు, ఆగొల్లు బలేస్వామి, గుజ్జల రామలక్ష్మి, ఎర్రా రాంబాబు, గాలిప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T06:31:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising