మార్చి 13 నుంచి పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర
ABN, First Publish Date - 2022-02-04T04:44:23+05:30
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 96వ జాతర మహోత్సవాలు మార్చి 13 నుంచి 15 వరకు నిర్వహించేందుకు దేవదాయశాఖాధికారులు నిర్ణయించారు.
పోలిపల్లి పైడితల్లి అమ్మవారు
7న పందిరిరాట
రాజాం రూరల్, ఫిబ్రవరి 3: ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు, రాజాం శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి 96వ జాతర మహోత్సవాలు మార్చి 13 నుంచి 15 వరకు నిర్వహించేందుకు దేవదాయశాఖాధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఈనెల 7వ తేదీన అమ్మవారి ఆలయ ప్రాంగణంలో పందిరిరాట, గోడపత్రిక ఆవిష్క రణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మార్చి 11న అమ్మవారికి నేత్రోత్సవం, 13 నుంచి 15 వరకూ మూడు రోజుల పాటు జాతర జరుగుతుంది. చివరిరోజున సుమారు లక్ష మంది దర్శించుకునే అవకాశం ఉంది.
Updated Date - 2022-02-04T04:44:23+05:30 IST