‘విష వ్యూహాలు సరికావు’
ABN, First Publish Date - 2022-12-15T23:49:39+05:30
రాజకీయ పార్టీలకు విష వ్యూహాలు అందించడం వ్యూహకర్తలకు సరికాదని మాజీ మంత్రి గుండ అప్పలసూ ర్యనారాయణ అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు.
శ్రీకాకుళం(ఆంధ్రజ్యోతి): రాజకీయ పార్టీలకు విష వ్యూహాలు అందించడం వ్యూహకర్తలకు సరికాదని మాజీ మంత్రి గుండ అప్పలసూ ర్యనారాయణ అన్నారు. గురువారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడి పరిపాలన తీరును వక్రీకరిస్తూ వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్‌కిషోర్ విష వ్యూహాన్ని అమలుచేశాడని చెప్పారు. ప్రజా స్వామ్యం బద్ధంగా కాకుండా, విషంతో బలపరచడమన్నది సరికాదన్నారు. పార్టీలకు అతీతంగా విషవ్యూహాలు చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విష ప్రచారాలు చేస్తున్న వారిని తిప్పికొట్టేలా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.
Updated Date - 2022-12-15T23:49:40+05:30 IST