‘ఒడిసా ధాన్యం నిరోధించాలి’
ABN, First Publish Date - 2022-12-15T23:43:47+05:30
ఒడిసా నుంచి తీసుకొస్తున్న ధాన్యం విక్రయం నిరోధించాలని రైతు ల కోరారు.
కంచిలి: ఒడిసా నుంచి తీసుకొస్తున్న ధాన్యం విక్రయం నిరోధించాలని రైతు ల కోరారు. ఈ మేరకు రైతు సంఘ నాయకులు తహసీల్దార్ ఎస్.హైమావతికి వినతిపత్రాన్ని అందజేశారు. మండలంలో ఘాటి ముకుందాపురం, పోలేరు, కౌసరపడల ప్రాంతాల మీదుగా ఒడిశాకు చెందిన ధాన్యం వస్తున్నాయని తెలిపారు. వాటిని నిరోధించి ఇక్కడి రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో జె.ప్రసాదరావు, వేణు, దేవేంద్ర, ఉమాపతి, ఆనంద్ పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:43:48+05:30 IST