ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

600 మొక్కల్లో ఒక్కటీ బతకలేదు

ABN, First Publish Date - 2022-12-09T23:39:08+05:30

‘పైడిభీమవరం ఏపీఐఐసీ స్థలంలో పెంచిన 600 మొక్కలకు ఒక్క మొక్క కూడా బతకలేదు. కొంత మంది సంతకాలు లేకుండా నగదు చె ల్లించేశారు.

సామాజిక తనిఖీ నివేదికలు వెల్లడిస్తున్న అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- సంతకాలు లేకుండా నగదు చెల్లించేశారు

- సామాజిక తనిఖీ ప్రజా వేదికలో బహిర్గతం

రణస్థలం: ‘పైడిభీమవరం ఏపీఐఐసీ స్థలంలో పెంచిన 600 మొక్కలకు ఒక్క మొక్క కూడా బతకలేదు. కొంత మంది సంతకాలు లేకుండా నగదు చె ల్లించేశారు. దీనివల్ల ప్రభుత్వానికి ఖర్చుతప్ప పచ్చదనం ఎలా సాధ్యపడు తుంది.’ అని డ్వామా ఫైన్సాన్‌ అధికారి స్వరూపరాణి ప్రశ్నించారు. గత రెండేళ్లుగా మండలంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం పనులకు సంబంధించి ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో స్వరూపరాణి ఆధ్యర్యంలో శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. గత రెండేళ్లలో 30 గ్రామ పంచాయతీల్లో రూ.53 కోట్లతో చేపట్టిన పనులను సామా జిక తనిఖీ బృందాలు పరిశీలించాయి. ఈ వివరాలను ప్రజా వేదికలో అధికారులు వెల్లడిం చారు. మొక్కల పెంపకం బాగోలేదని, నిర్వహణ లోపంతో అధికంగా చనిపో యాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. 8 పంచాయతీల క్షేత్రస్థాయి సిబ్బంది, టెక్నికల్‌ అసిస్టెంట్ల పనితీరుపై అధికారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్కొక్కరికీ రూ.300 నుంచి రూ.500 వరకూ అపరాధ రుసుం విధించారు. ఈ రెండేళ్లలో వేతనదారులకు రూ.49 కోట్లు చెల్లించామని, రూ.4 కోట్ల వరకూ మెటీరియల్‌ ఇచ్చినట్లు అధికారులు వెల్లడించారు. మత్స్యకార గ్రామాల్లో ఉపాధి పనులు కల్పించాలని మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితుడు పిన్నింటి సాయికుమార్‌ కోరారు. వైఎస్‌ ఎంపీపీ డి.భుజంగ రావు, ఏపీడీ శైలజ, సూపరింటెండెంట్‌ కేవీవీ ప్రసాద్‌, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ శ్రావణ్‌, విజిలెన్స్‌ అధికారి సురేష్‌, మైలపల్లి కామరాజు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-09T23:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising