ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీలు లేనట్టేనా?

ABN, First Publish Date - 2022-12-09T23:48:58+05:30

ఎప్పుడెప్పుడా అంటూ బదిలీల కోసం ఎదురుచూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి ఉద్యోగాల్లో చేరి మూడేళ్లయింది. ఈ నేపథ్యంలో అక్టోబరులో బదిలీలు ఉంటాయని అధికారులు హడావుడి చేశారు.

లొద్దపుట్టి సచివాలయం భవనం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- మూడేళ్లుగా సచివాలయ ఉద్యోగుల ఎదురుచూపు

- అక్టోబరు నుంచి ప్రభుత్వం హడావుడి

- తాజాగా వచ్చే ఏప్రిల్‌ నుంచి అంటూ ఊహాగానాలు

(ఇచ్ఛాపురం రూరల్‌)

ఎప్పుడెప్పుడా అంటూ బదిలీల కోసం ఎదురుచూస్తున్న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. ఈ ఏడాది అక్టోబరు నాటికి ఉద్యోగాల్లో చేరి మూడేళ్లయింది. ఈ నేపథ్యంలో అక్టోబరులో బదిలీలు ఉంటాయని అధికారులు హడావుడి చేశారు. కాగా ప్రభుత్వం తాజాగా ఆ ఆలోచనను విరమించుకుని, వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి అంటూ ఊహగానాలు వినిపిస్తున్నాయి. దీంతో బదిలీల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల ఆశలు ఆవిరయ్యాయి. జిల్లాలో 921 గ్రామ పంచాయతీల పరిధిలో 657 సచివాలయాలు ఉన్నాయి. 6,931 మంది సచివాలయ ఉద్యోగులు పని చేస్తున్నారు. నియామకాల సమయంలో గందరగోళం, ప్రభుత్వ అధికారుల నిర్వాకం కారణంగా చాలామంది మెరిట్‌ సాధించిన అభ్యర్థులు మారుమూల ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. తొలుత మెరిట్‌ ర్యాంకు ప్రకారం వార్డు ఎమినిటీస్‌ సెక్రటరీగా నియామక పత్రాలు ఇచ్చిన అధికారులు తీరిగ్గా రెండు నెలల తర్వాత కళ్లు తెరిచారు. వారు తొలుత ఎంచుకున్న ఆప్షన్‌ ప్రకారం గ్రామ కార్యదర్శి గ్రేడ్‌-5గా వెళ్లాలని ఆదేశించారు. అప్పటికే గ్రామ కార్యదర్శుల పోస్టులన్నీ భర్తీ అయిపోవడంతో ఎవరూ వెళ్లడానికి ఇష్టపడని ప్రాంతాలకు మెరిట్‌ అభ్యర్థులు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పటి నుంచి వీరంతా బదిలీల కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇదిగో.. అదిగో అంటూ అధికారులు మూడేళ్లు గడిపేశారు. తాజాగా వచ్చే ఏడాది ఏప్రిల్‌లో బదిలీలు ఉంటాయని చెబుతున్నారు. దీంతో ఇంకా నాలుగైదు నెలలు తమకు ఎదురుచూపులు తప్పవని ఉద్యోగులు నిరాశ చెందుతున్నారు.

జిల్లాల విభజనతో...

ఈ ఏప్రిల్‌లో జిల్లాల విభజన జరిగింది. ఉమ్మడి జిల్లాలో రాజాం నియోజకవర్గంలోని నాలుగు మండలాలు విజయనగరం జిల్లాలో, పాలకొండ నియోజకవర్గంలోని నాలుగు మండలాలు మన్యం పార్వతీపురం జిల్లాలో విలీనమయ్యాయి. దీంతో ఉద్యోగం చేసే జిల్లా ఒకటి కాగా.. నివాసముండే ప్రాంతాలు వేరే జిల్లాలకు వెళ్లిపోయాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఉద్యోగులను ప్రస్తుతమున్న జిల్లాలకే పరిమితం చేస్తారా? లేక నివాస ప్రాంతలను బట్టి బదిలీ చేస్తారా? అన్న సంశయం వారిని వెంటాడుతోంది. దీంతో ఆరు నెలలుగా బదిలీలకు సంబంధించిన డిమాండ్‌ ఉద్యోగుల నుంచి బలంగా వినిపిస్తోంది. తమ జిల్లాలకు వెళ్లాలని భావిస్తున్న అభ్యర్థులు ఎంతో ఆశగా బదిలీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబరులో బదిలీలు ఉంటాయన్న ప్రకటనలు వెలువడ్డాయి. స్థానిక ప్రజాప్రతినిధులు సంక్రాంతి వరకూ బదిలీలు చేయవద్దని ప్రభుత్వానికి విన్నవించినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వం బదిలీలను మరో రెండు నెలలు వాయిదా వేసింది. ఉద్యోగులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. దీనిపై జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్‌ను వివరణ కోరగా బదిలీలపై ఇంతవరకు ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదన్నారు. ఉత్తర్వులు వచ్చిన తర్వాత వాటి నిబంధనలకు అనుకూలంగా బదిలీలు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు.

Updated Date - 2022-12-09T23:49:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising