కరిగిపోతున్న సైలాడ కొండలు
ABN, First Publish Date - 2022-01-03T05:00:07+05:30
సైలాడ రెవెన్యూ పరిధిలో ఉన్న చిట్టివలస సమీపంలో కొండలు కరిగిపోతున్నాయి. కొందరు అనుమతిలేకుండా కొండలు తవ్వేస్తున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు.
ఆమదాలవలస: సైలాడ రెవెన్యూ పరిధిలో ఉన్న చిట్టివలస సమీపంలో కొండలు కరిగిపోతున్నాయి. కొందరు అనుమతిలేకుండా కొండలు తవ్వేస్తున్నా రెవెన్యూ, గనుల శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారు. సైలాడ రెవెన్యూపరిధిలోని సర్వేనెంబరు 183లో 230 ఎకరాలపైన సైలాడ, దివాంజీపేట, గాజులకొల్లివలసల్లో కొండలు విస్తరించిఉన్నాయి. గాజులకొల్లివలస సమీపంలో ప్రసిద్ధిచెందిన సంగమేశ్వ రాలయం కూడాఉంది. నల్లకొండలతోపాటు చిట్టివలస సమీపంలో ఎర్రకొండలు ఉన్నాయి. మార్కెట్‌లో రాయి మెటల్‌కు డిమాండ్ ఉండడంతో కొంతమంది రెవెన్యూ, గను లశాఖ అధికారుల అనుమతి లేకుండా కొండలను పిండిచేసి తరలిస్తు న్నారు. నిత్యం అధికారులు కొండలను తవ్వేసే మార్గంలోనే ప్రతిరోజూ సచివాలయ సిబ్బంది రాకపోకలు సాగిస్తున్నా చర్యలు తీసు కోవడంలేదని పలువురు వాపోతున్నారు. గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్డు పనులకోసం దివాంజీపేట సమీపంలో కొండలు గుల్లచేసిన విషయం విదితమే.కాగా, చిట్టివలస కొండల్లో రాళ్లు తవ్వుతున్న విషయం తనకు తెలియదని తహసీల్దార్ వైవీ పద్మావతి ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పరిశీలించి కొండలను తవ్వుతున్న వారిపై చర్యలు చేపడతామని చెప్పారు.
Updated Date - 2022-01-03T05:00:07+05:30 IST