ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టౌన్‌షిప్‌లో సదుపాయాల కల్పనకు చర్యలు

ABN, First Publish Date - 2022-07-07T05:10:39+05:30

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మాణం చేపడుతున్న టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత ఆదేశిం చారు. బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో జగనన్న టౌన్‌షిప్‌ ఏర్పాటుకు సేకరించిన 150 ఎకరాల స్థలాన్ని బుధవారం ఆమె పరిశీలించారు.

లేఅవుట్‌ను పరిశీలిస్తున్న జేసీ విజయసునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జేసీ విజయసునీత

పలాసరూరల్‌ , జూలై 6:  ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా  నిర్మాణం చేపడుతున్న టౌన్‌షిప్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జాయింట్‌ కలెక్టర్‌ విజయసునీత ఆదేశిం చారు. బొడ్డపాడు రెవెన్యూ పరిధిలో జగనన్న టౌన్‌షిప్‌ ఏర్పాటుకు సేకరించిన 150 ఎకరాల స్థలాన్ని బుధవారం ఆమె పరిశీలించారు. టౌన్‌షిప్‌ పనులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. లేఅవుట్‌లో ఎన్ని ఇళ్లు వస్తాయి, ఒక్కో స్థలం ఎన్ని సెంట్ల స్థలం, మౌలిక సదు పాయాలపై ఆమె ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లా డుతూ.. లేఅవుట్‌లో రోడ్లు, కాలువలు, విద్యుత్‌ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పనకు పనులు ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో టి.సీతారామమూర్తి, ఎంపీడీవో ఎన్‌.రమేష్‌నాయుడు, ఆర్‌ఐ రవికుమార్‌, సర్వేయర్‌ చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. 


నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు 

కాశీబుగ్గ: సచివాలయంలో సిబ్బంది ప్రజలకు అందు బాటులో ఉండి సేవలందించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా ఉపేక్షించేది లేదని జేసీ విజయసునీత హెచ్చరించారు. కాశీబుగ్గలో పద్మనాభపురం, పద్మనాభపురం కాలనీ సచివాలయాలను బుధవారం ఆమె పరిశీలించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు సకాలంలో అందేలా చూడాలని, పథ కాల వివరాలను సచివాలయం వద్ద ప్రతి ఒక్కరికి కనిపించేలా ప్రదర్శించాలన్నారు.  సచివాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు. 

 

Updated Date - 2022-07-07T05:10:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising