బ్యాంకు ఖాతాల్లో నగదు మాయం
ABN, First Publish Date - 2022-12-31T00:06:59+05:30
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బ్యాంకు ఖాతాదారుల నుం చి వేలాది రూపాయలు మాయవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు.
కవిటి: మండలంలోని పలు గ్రామాలకు చెందిన బ్యాంకు ఖాతాదారుల నుం చి వేలాది రూపాయలు మాయవుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. తమ ప్రమేయం లేకుండా, సంతకాలు చేయకుండా బ్యాంకు ఖాతాలో నుంచి నగదు డ్రా అవుతోందని చెబుతున్నారు. ఈ విషయంపై సదరు బ్యాంకు మేనేజర్లకు ఫిర్యాదు చేసినా ఏ విధంగా పోతున్నాయో వారు గుర్తించలేకపోవడంతో ఖాతా దారులు గుబులు చెందుతున్నారు. ఈ మేరకు బెలగాంకు చెందిన శ్రీనివాసరౌళో, కేశుపురానికి చెందిన కర్రి ఉమాపతి తదితరులు పోలీసులకు, మరికొందరు సం బంఽధిత బ్యాంకు మేనేజర్లకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాధితుల కథనం మే రకు.. కవిటి మండలంలోని ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన బదకల ఈశ్వరరా వు ఎస్‌బీఐ ఖాతా నుంచి 26, 27 తేదీల్లో పదివేలు చొప్పున, గత నెలలో రూ.ఐదు వేలు మాయమ య్యాయి. ప్రగడపుట్టుగ గ్రామానికి చెందిన ప్రియా సుధాకర్‌కు సంబంధించి కవిటి ఎస్‌బీఐ ఖాతాలో ఈనెల 25న రూ. 10 వేలు, జగతికి చెందిన పొల్లాయి ఈశ్వరరావు యూనియన్ బ్యాంక్ సోంపేట బ్రాంచ్ ఖాతా నుంచి ఈ నెల 27న రూ. 3,200లు మాయమయ్యాయి. బెలగాం గ్రామానికి చెందిన శ్రీని వాసరౌళో శిలగాం ఎస్‌బీఐ ఖాతా నుంచి ఈనెల 29న రూ. 10 వేలు డ్రా అయిన ట్లు ఫోన్‌కు మెసెజ్ వచ్చింది. వెంటనే బ్యాంకు వెళ్లి ఖాతాను లాక్ చేయించారు. భైరిపురానికి చెందిన ఉపాధ్యాయిని పుల్లట ఆదిలక్ష్మి రాజపురం యూనియన్ బ్యాంక్ ఖాతా నుంచి ఈ నెల 24,25 తేదీల్లో రూ.పది వేలు చొప్పున, కేసుపురా నికి చెందిన కర్రి ఉమాపతి రాజపురం యూని యన్ బ్యాంక్ ఖాతా నుంచి ఈ నెల 18న 4600, ఎస్‌బీఐ ఇచ్ఛాపురం ఖాతా నుంచి రూ.7500 నగదు మాయ మైనట్లు బ్యాంకు మేనేజర్లకు ఫిర్యాదు చేశారు.
నగదు తిరిగి జమ చేస్తాం
బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయిన బాధితులు ఆందోళన చెందవలసిన పని లేదని రాజపురం యూనియన్ బ్యాంకు బీఎం ఎల్.మిశ్ర ఆంధ్రజ్యోతికి తెలిపా రు. ఓటీపీ, ఫోన్ నెంబరు చెప్పిన వారి ఖాతాలో డబ్బులు పోతే తిరిగి వారి ఖాతాలో నగదు జమచేస్తామని చెప్పారు. వారి వివరాలు నేషనల్ పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ)కు పంపిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి గైడ్‌లైన్స్ లేవని, ఫింగర్ ఫ్రింట్స్ ఆధారంగా నగదు పోతున్నట్టు తెలుస్తోందని, రికవరీ చేసి నగదు జమ చేస్తామని చెప్పారు.
Updated Date - 2022-12-31T00:07:01+05:30 IST