ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోర్టు నిర్మాణానికి ఒప్పుకోం

ABN, First Publish Date - 2022-08-03T05:57:20+05:30

ఏడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. మా భూములు ఎందుకు అడుగుతున్నారు? ప్రభుత్వ భూమిలో పోర్టు నిర్మాణం చేపట్టండి. అసలు మేము పోర్టు వద్దంటే ప్యాకేజీలు, పరిహారం మాట ఎందుకు?’.. అంటూ మూలపేట గ్రామస్థులు తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పోర్టు నిర్మాణానికి ఒప్పుకోమ

మంత్రి అప్పరాజుతో జీరు భీమారావు వాగ్వాదం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడు వేల ఎకరాలు ఉండగా.. మా భూములే కనిపించాయా?

మంత్రి ఎదుటే తేల్చిచెప్పిన మూలపేట గ్రామస్థులు

 టెక్కలి, ఆగస్టు 2:  ‘ఏడు వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా.. మా భూములు ఎందుకు అడుగుతున్నారు? ప్రభుత్వ భూమిలో పోర్టు నిర్మాణం చేపట్టండి. అసలు మేము పోర్టు వద్దంటే ప్యాకేజీలు, పరిహారం మాట ఎందుకు?’.. అంటూ మూలపేట గ్రామస్థులు తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో పోర్టు నిర్మాణానికి ఒప్పుకోమన్నారు. మంగళవారం సాయంత్రం మూలపేటలో మంత్రి సీదిరి అప్పరాజు, కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ పర్యటించారు. గ్రామస్థులతో సమావేశమయ్యారు. మంత్రి అప్పలరాజు మాట్లాడుతూ వంశధార ఎడమ ప్రధాన కాలువ నిర్మాణానికి నాడు త్యాగం చేశారని.. అలాగే పోర్టు నిర్మాణానికి కూడా త్యాగాలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ గతంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కార్లలో తిరిగే వారే పోర్టు నిర్మాణం వద్దంటున్నారని ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన టీడీపీ మండల అధ్యక్షుడు జీరు భీమారావు మాట్లాడుతూ నాడు పోర్టు నిర్మాణ ప్రతిపాదిత ప్రాంతం భావనపాడు అన్న విషయం గుర్తించుకోవాలన్నారు. ఇక్కడ పోర్టు నిర్మాణం వద్దన్నదే తమ అభిప్రాయమన్నారు. మేము వద్దంటున్న పునరావాసం, ప్యాకేజీలు, సర్వేలు అవసరమా అని ప్రశ్నించారు. అందుబాటులో ఉన్న ఏడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నా.. మా భూములే కనిపించాయా అంటూ గ్రామస్థులు ప్రశ్నించారు. కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ మాట్లాడుతూ పోర్టు నిర్మాణానికి మూలపేట ప్రాంతం డిజైన్‌ పరంగా ముఖద్వారంగా నిలిచిందని తప్ప మీకు ఇబ్బందులు పెట్టాలన్నది మా ఉద్దేశ్యం కాదన్నారు.  మరోసారి చర్చించుకొని అందరి అభిప్రాయాలను తీసుకుంటామన్నారు. సమావేశంలో జేసీ విజయసునీత, ఆర్డీవో హనుమంతు జయరాం, సర్పంచ్‌ భాస్కరరావు, ఎంపీటీసీ నక్క భీమారావు తదితరులు ఉన్నారు. కాగా గ్రామంలో భారీ బందోబస్తు ఏర్పాటుచేయడం చర్చనీయాంశంగా మారింది. 




Updated Date - 2022-08-03T05:57:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising