ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అబద్దాలు చెప్పటంలో జగన్‌ (Jagan)కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సరిపోదు: Kuna Ravikumar

ABN, First Publish Date - 2022-06-28T18:17:39+05:30

తీత్లీ పరిహారం ఇవ్వటానికి మూడేళ్లు పట్టిందని టీడీపీ నేత కూన రవికుమార్విమర్శించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం (Srikakulam): జగన్మోహన్ రెడ్డి (CM jagan) ముఖ్యమంత్రి అయ్యాక శ్రీకాకుళం జిల్లాకు మూడుసార్లు వచ్చారని, తీత్లీ పరిహారం ఇవ్వటానికి మూడేళ్లు పట్టిందని టీడీపీ (TDP) నేత కూన రవికుమార్ (Kuna Ravikumar) విమర్శించారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ అబద్దాలు చెప్పటంలో జగన్‌కు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సరిపోదన్నారు. జగన్ మోసపు రెడ్డి.. ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుడని అన్నారు. సిక్కోలుకు సీఎం ఒరగబెట్టేది ఏమి లేదన్నారు. నాన్న బుడ్డిపై 100 రూపాయలు నొక్కితే తప్పా.. అమ్మఒడి ఇవ్వలేని పరిస్థితని విమర్శించారు. ఎంతోమంది మహిళల తాళి బొట్లు తెంపేస్తున్నారని, నవరత్నాలు ఒక్కక్కొక్కటి రాలిపోతున్నాయన్నారు. 


ఎన్నికల సమయంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తామన్నారని కూన రవి కుమార్ అన్నారు. సీఎం జగన్ చెప్పే అబద్దాలు ప్రజలు నమ్ముతారని అనుకుంటున్నారు.. మ్యానిఫెస్టో అమలు చేయని నాయకుణ్ణి చెప్పుతో కొట్టమన్నారు.. ఇప్పుడు ఏపీ ప్రజలు దేనితో కొట్టాలో జగన్ చెప్పాలన్నారు. రూ. 13వేలు ఇచ్చి చిన్నారులతో రూ. 15వేలు ఇచ్చినట్టు అబద్దాలు చెప్పిస్తున్నారని ఆరోపించారు. మంత్రి బొత్స శుభాషితాలు చాగంటి కోటేశ్వరరావుని మించిపోయాయని ఎద్దేవా చేశారు. బొత్స పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైఎస్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారని, జగన్, విజయలక్ష్మిపై అనుమానం ఉందని ఆనాడు బొత్స చెప్పలేదా? అని ప్రశ్నించారు. నేడు మంత్రి బొత్స సత్యనారాయణ ఊసరవెల్లిని మించిపోయారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 25 శాతం జరిగిన పనులను మళ్ళీ ప్రారంభించి.. గొప్పలు చెప్పుచెప్పుకోవడానికి సిగ్గుగా లేదా? అని రవి కుమార్ ప్రశ్నించారు. 

Updated Date - 2022-06-28T18:17:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising