ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జిల్లా ఆసుపత్రిలో కుమ్ములాట

ABN, First Publish Date - 2022-12-15T23:48:19+05:30

టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కుమ్ములాటకు దారితీశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టెక్కలి రూరల్‌: టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది మధ్య ఉన్న అంతర్గత విభేదాలు కుమ్ములాటకు దారితీశాయి. గురువారం ఆసుపత్రిలోని జనరల్‌ డ్యూటీ అసిస్టెంట్లు, నర్సింగ్‌, ఫార్మసీ సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఫార్మసీ విభాగానికి సం బంధించిన మందులను అన్‌లోడ్‌ చేసే విషయంలో వీరి మధ్య ఘర్షణ జరిగింది. తమతో అన్ని పనులు చేయించుకుని తిట్లు తిడుతున్నారని పలువురు జీడీఏలు వాపోతు న్నారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ క్యాజువాలిటీ విభాగాల్లో పనిచేయించుకోవడంతో పాటు ఇతర పనుల్లో కూడా ఉపయోగించుకుంటూ నర్సింగ్‌ సిబ్బంది అవమానకరంగా మాట్లా డుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జిల్లా ఆసుపత్రిలో జీడీఏలుగా 17 మం దిని నియమించగా ప్రస్తుతం 15 మంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపఽథ్యంలో ఆసుప త్రిలో జీడీఏలు, నర్సింగ్‌ సిబ్బంది ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. మంగళవారం రాత్రి కూడా స్టాఫ్‌నర్సు ట్రైనీగా ఉన్న ఒక ఏఎన్‌ఎం, మరో స్టాఫ్‌నర్సు మధ్య మాటమాటా పెరిగి వాగ్వాదం జరిగినట్టు సిబ్బంది చర్చించు కుంటున్నారు. జిల్లా ఆసుపత్రిలో సిబ్బంది మధ్య అంతర్గత ఆధిపత్యపోరు అధికమవు తుందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీనికితోడు ఆసుపత్రి ఉన్నతాధికారులు కూడా చూ సీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సూర్యారావును ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా, సిబ్బంది మధ్య జరిగిన వివాదం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated Date - 2022-12-15T23:48:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising