ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుమారన్న ఆశయాలను కొనసాగించాలి

ABN, First Publish Date - 2022-09-11T05:00:28+05:30

శ్రీకాకుళం నక్సల్బరీ పోరాటంలో ప్రాణాలర్పించిన కుమా రన్న, నిరంతరం బడుగు ప్రజల అభ్యున్నతికై పోరాటం చేసిన జయమ్మ ఆశయాలను కొన సాగించాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వరరావు అన్నారు. బొడ్డ పాడులో శనివారం కుమారన్న వర్థంతి, జయమ్మ జీవిత చరిత్రపై పుస్తకావిష్కరణ కార్యక్ర మం సంఘం నాయకుడు వంకల మాధవ రావు అధ్యక్షతన నిర్వహించారు.

పుస్తకావిష్కరణ చేస్తున్న న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత చిట్టిపాటి వెంకటేశ్వరరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూడెమోక్రసీ రాష్ట్ర నేత వెంకటేశ్వరరావు 

బొడ్డపాడు(పలాసరూరల్‌): శ్రీకాకుళం నక్సల్బరీ పోరాటంలో ప్రాణాలర్పించిన కుమా రన్న, నిరంతరం బడుగు ప్రజల అభ్యున్నతికై పోరాటం చేసిన జయమ్మ ఆశయాలను కొన సాగించాలని సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు చిట్టిపాటి వెంకటేశ్వరరావు అన్నారు. బొడ్డ పాడులో శనివారం కుమారన్న వర్థంతి, జయమ్మ జీవిత చరిత్రపై పుస్తకావిష్కరణ కార్యక్ర మం సంఘం నాయకుడు వంకల మాధవ రావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడు తూ.. నక్సల్బరీ ఉద్యమంలో సుమారు 362 మంది ప్రాణాలను అప్పటి పాలకులు బూటకపు ఎన్‌కౌంటర్‌ చేసి కిరాతకంగా హత్య చేశారన్నారు. బడుగు, బలహీన వర్గాలకు బాసటగా నిలిచి కుమారన్న, జయమ్మలు విశేషంగా పోరాటం చేశార న్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని సమస్యల పరిష్కారానికి పాటుపడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను తీసు కొచ్చి ఆదివాసీలను అడవుల నుం చి తరిమేందుకు కుట్ర చేస్తోందని దీనిని తిప్పి కొట్టాలన్నారు. సీపీఐఎంఎల్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు మద్దిల మల్లేశం మాట్లాడుతూ.. విప్లవ పార్టీల సభ్యులు ఐక్యంగా ముందుకు వచ్చి చట్టసభల్లో అఽధి కారం పొందాలని, అప్పుడే కుమారన్న, జయమ్మలకు నిజమైన నివాళి అన్నారు. అనంతరం ‘నేను శ్రీకాకుళం జయమ్మను’ పుస్తకాన్ని ఆవిష్కరించారు.  పౌరహ క్కుల జిల్లా సంఘ అధ్యక్షుడు పత్రి దానేసు, వామపక్షాల నాయకులు జుత్తు వీరాస్వామి, ఎం.వినోద్‌, కుత్తుమ వినోద్‌, సవర బంగ్లా తదితరులు పాల్గొన్నారు. అరుణోదయ, ప్రజా కళామండలి కళాకారులు విప్లవ గీతాలను ఆలపించారు. 

 

Updated Date - 2022-09-11T05:00:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising