కోల్‌కతా టు చెన్నై
ABN, First Publish Date - 2022-12-16T23:13:33+05:30
రెడీమేడ్ వస్త్రాలను కోల్‌కతా నుంచి చెన్నైకు తప్పుడు వే బిల్లులతో తరలిస్తున్న రెండు కంటైనర్లను జీఎస్టీ అధికారులు గుర్తించారు. జీఎస్టీ రాష్ట్ర జాయింట్ కమిషనర్ కె.రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు నరసన్నపేట జీఎస్టీ అధికారులు ఈ నెల 13న రాత్రి చిలకపాలెం, మడపాం వద్ద కంటైనర్లను పరి శీలించారు. అక్రమంగా రెడీమేడ్ వస్త్రాలు తరలి పోతున్నట్టు గుర్తించి.. అపరాధ రుసుం విధించా రు.
తప్పుడు వే బిల్లులతో రెడీమేడ్ వస్ర్తాల తరలింపు
జీఎస్టీ అధికారులకు పట్టుబడిన రెండు కంటైనర్లు
నరసన్నపేట, డిసెంబరు 16: రెడీమేడ్ వస్త్రాలను కోల్‌కతా నుంచి చెన్నైకు తప్పుడు వే బిల్లులతో తరలిస్తున్న రెండు కంటైనర్లను జీఎస్టీ అధికారులు గుర్తించారు. జీఎస్టీ రాష్ట్ర జాయింట్ కమిషనర్ కె.రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు నరసన్నపేట జీఎస్టీ అధికారులు ఈ నెల 13న రాత్రి చిలకపాలెం, మడపాం వద్ద కంటైనర్లను పరి శీలించారు. అక్రమంగా రెడీమేడ్ వస్త్రాలు తరలి పోతున్నట్టు గుర్తించి.. అపరాధ రుసుం విధించా రు. ఇందుకు సంబంధించి శుక్రవారం రాష్ట్ర పన్ను లశాఖ అసిస్టెంట్ కమిషనర్ టి.శ్రీనివాసరావు, డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ కేశవరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్‌లోని కోల్ కతా నుంచి తమిళనాడు రాష్ట్రంలో చెన్నైకు రడీ మేడ్ వస్త్రాలను కంటైనర్లలో అక్రమంగా తరలిస్తు న్నట్టు జీఎస్టీ అధికారులకు సమాచారం అందింది. ఈ మేరకు ఈ నెల 13న రాత్రి చిలకపాలెం, మడపాం వద్ద రెండు కంటైనర్లను పరిశీ లించారు. వే బిల్లులో బేల్స్‌కు, కంటై నర్‌లలో ఉన్న బేల్స్‌కు తేడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దీంతో వాహ నాలను నరసన్నపేట మార్కెట్ కమిటీ ఆవరణకు తరలించి.. పూర్తిస్థాయిలో పరిశీలించారు. 123 బేల్స్‌తో కూడిన రెడీమేడ్ వస్త్రాలకుగానూ 39 బేల్స్‌కు బిల్లులు లేకపోవడాన్ని గుర్తించారు. మొత్తం రూ.25లక్షల విలువైన సరుకును పన్ను చెల్లించకుండా.. అక్రమంగా తరలిస్తున్నందుకు వీటీపై అపరాధ రుసుం 200 శాతం విధించా మని అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరావు తెలి పారు. రూ.2.25 లక్షల అపరాధ రుసుం వసూలు చేశామన్నారు. తప్పుడు వే బిల్లులతో రెడీమేడ్ వస్ర్తాలను దిగుమతి చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. దాడుల్లో డిప్యూటీ అసిస్టెంట్ కమిషనర్ ఉప్పాడ కేశవరావు, జీఎస్టీ అధికారులు బి.నాగేశ్వరరావు, శ్రీనివాసరావు, పి.ఉషారాణి, డి.శ్రీనివాసరావు, బాలు, దిలీప్, భరద్వాజ్, మణి దీప్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-16T23:13:34+05:30 IST