ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రిజర్వాయర్లకు జలకళ

ABN, First Publish Date - 2022-08-09T06:46:50+05:30

జిల్లాలోని జలాశయాలు నిండు కుండలా ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, గెడ్డలు పొంగి జలాశయాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది.

నిండు కుండలా రైవాడ జలాశయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ఇటీవల కురుస్తున్న వర్షాలకు నిండుతున్న జలాశయాలు

- గరిష్ఠ నీటిమట్టానికి చేరువలో రైవాడ, పెద్దేరు, కల్యాణపులోవ


                            (అనకాపల్లి- ఆంధ్రజ్యోతి)

జిల్లాలోని జలాశయాలు నిండు కుండలా ఉన్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, గెడ్డలు పొంగి జలాశయాల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతోంది. రైవాడ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 114 మీటర్లు కాగా 113.45 మీటర్లకు నీరు చేరింది. ప్రస్తుతం పది గేట్లలో రెండు గేట్లు ఎత్తేశారు. గత రెండు మూడు రోజులుగా వర్షాల కారణంగా ఎగువ ప్రాంతం నుంచి 1400 క్యూసెక్కుల వరద నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. 1200 క్యూసెక్కుల వరద నీటిని 8, 9 గేట్లను ఎత్తివేయడం ద్వారా శారదా నదిలోకి వదిలేశారు. కుడి, ఎడమ కాలువల ద్వారా 15,344 ఎకరాలకు నీరు విడుదల చేశారు. ఎడమ కాలువ ఆయకట్టుకు 100 క్యూసెక్కులు, కుడి కాలువకు 50 క్యూసెక్కులు, జీవీఎంసీ విశాఖపట్నం తాగునీటి అవసరాలకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఖరీఫ్‌ పంటల సాగుకు సన్నద్ధమవుతున్న రైతులు జలాశయాల్లో నీటి నిల్వలను చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దేవరాపల్లి మండలం రైవాడ జలాశయానికి ఎగువ ప్రాంతమైన ఏఎస్‌ఆర్‌ జిల్లా అనంతగిరి మండలం పెదకోట, పినకోట ఏజెన్సీలో గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ నీరు రైవాడ జలాశయానికి చేరుతోంది. రైవాడ జలాశయం పరిధిలోని రైతులకు నీరు విడుదల చేశారు. రావికమతం మండలం కల్యాణపులోవ జలాశయం గరిష్ఠ నీటిమట్టం 460 అడుగులు కాగా ప్రస్తుతం వర్షాల కారణంగా జలాశయంలో నీటిమట్టం 459.20 అడుగులకు చేరింది. సుమారు 250 క్యూసెక్కుల వర్షపు నీరు జలాశయంలోకి గత రెండు రోజుల్లో వచ్చి చేరింది. సోమవారం రెండు గేట్లు ఎత్తేసి సుమారు 150 క్యూసెక్కుల నీటిని వదిలేశారు. కోనాం జలాశయ గరిష్ఠ నీటి మట్టం 101.25 మీటర్లు కాగా సోమవారం ఉదయానికి 99.50 మీటర్లకు నీరు చేరింది. 130 క్యూసెక్కుల వర్షపు నీరు జలాశయంలోకి వచ్చి చేరింది. పెద్దేరు గరిష్ఠ నీటి మట్టం 137 మీటర్లు కాగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు, ఎగువ ప్రాంతం నుంచి వచ్చి చేరుతున్న నీటి నిల్వల కారణంగా జలాశయంలో 136.25 మీటర్లకు నీరు చేరింది. 250 క్యూసెక్కులు వర్షపు నీరు జలాశయంలోకి అదనంగా రావడంతో కుడి, ఎడమ కాలువలకు స్పిల్‌వే ద్వారా 80 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. 

----

జిల్లాలో జలాశయాల్లో నీటి నిల్వలు ఇలా...

----------------------------------------------------------------

జలాశయం       గరిష్ఠం       ప్రస్తుతం

----------------------------------------------------------------

రైవాడ       114.00 మీటర్లు     113.45 మీటర్లు

పెద్దేరు       137 మీటర్లు        136.25 మీటర్లు

కోనాం        101.25 మీటర్లు      99.50 మీటర్లు

కల్యాణపులోవ  460 అడుగులు     459.20 అడుగులు

----------------------------------------------------------------


Updated Date - 2022-08-09T06:46:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising