శివారు భూములకు నీరందించండి
ABN, First Publish Date - 2022-12-31T00:03:57+05:30
sss
అరసవల్లి, డిసెంబరు 30: వంశధార కాలువలకు కొత్త షట్టర్లు బిగించి శివారు భూములకు సాగునీరు అందించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గోవిం దరావు, కార్యవర్గ సభ్యుడు బి.కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడా రు. ప్రస్తుతం 513 షట్టర్లు పూర్తిగా పాడైపోయాయని చెప్పారు. దీంతో రైతులు తాటి దుంగలు, ఇసుక బస్తాలు అడ్డు పెట్టుకుని శివారు భూములకు సాగునీటిని తీసుకెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. 300 మంది లష్కర్లు అవసరం కాగా కేవలం 70 మంది మాత్రమే ఉన్నారని, వారికి కూడా జీతాలు సరిగా ఇవ్వడం లేదన్నారు. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కోరారు. లేదంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Updated Date - 2022-12-31T00:04:02+05:30 IST