ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘ఇతర కులాలను చేరిస్తే ఉద్యమిస్తాం’

ABN, First Publish Date - 2022-11-21T00:29:07+05:30

ఎస్టీ జాబితాలో బోయ, వాల్మీకి, నకిలీ బెంతుఒరియా కులాలను చేరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఆదివాసీ ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సవర రాంబాబు హెచ్చరించారు.

టెక్కలి: పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఆదివాసీ సంఘ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిపురం: ఎస్టీ జాబితాలో బోయ, వాల్మీకి, నకిలీ బెంతుఒరియా కులాలను చేరిస్తే ప్రజా ఉద్యమం తప్పదని ఆదివాసీ ఐక్య పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సవర రాంబాబు హెచ్చరించారు. మందస మండలం రామరాయి, గోపిటూరు, కొయ్యాడివీధి, గడ్డివీధి తదితర గ్రామాల్లో ఆదివారం జీవో నెం. 52 వెంటనే రద్దు చేయాలని కోరుతూ ర్యాలీలు చేపట్టారు. జీవో రద్దుచేసి జేసీ శర్మ కమిషన్‌ నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఏఐఏఈఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యాయులు సవర జగన్నాయకులు, పి.ఈశ్వరరావు, లోకేష్‌, రామారావు, ఆనందరావు, అప్పలయ్య, జగన్‌, కామయ్య, మల్లయ్య, శేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

- టెక్కలి: రాష్ట్ర ప్రభుత్వ బోయ, వాల్మీకి, వడ్డి, నకిలీ బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.52ను తక్షణమే రద్దు చేయాలని ఆదివాసీ సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఆదివారం ఇందుకు సంబంధించిన పోస్టర్లను టెక్కలిలో ఆవిష్కరించారు. ఈనెల 29న ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి సబ్‌కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించనున్నట్టు సంఘ నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘ నాయకులు ఎన్‌.నాగరాజు, పెద్దింటి నేపాల్‌, ఆనందరావు, రమణమూర్తి, అప్పలనాయుడు తదితరులు తెలిపారు.

- పాతపట్నం: నియోజకవర్గ కేంద్రంలో ఈ నెల 22న నిర్వహించ నున్న చలో పాతపట్నం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి గురాడి అప్పన్న పిలుపునిచ్చారు. స్థానిక గిరిజన సామాజిక భవన ప్రాంగణంలో ఆదివారం పోస్టర్లను ఆవిష్క రించారు. బైదలా పురం సింహాచలం, యోగి, రామారావు పాల్గొన్నారు.

- కొత్తూరు: బోయ వాల్మీకి, వడ్డి కులస్థులను గిరిజనులుగా గుర్తించొద్ద ని ఆ సంఘ నాయకులు కోరారు. ఆదివారం ఆ సంఘ నాయకులు లోతుగెడ్డ తులసీవర ప్రసాద్‌ను పలువురు ఆదివాసీలు కలిశారు. ఈ నెల 22న మెళియాపుట్టి, పాతపట్నం, హిరమండలం, కొత్తూరు, ఎల్‌ఎన్‌ పేటలో నిర్వహించే ర్యాలీలో పాల్గొనాలని కోరారు.

Updated Date - 2022-11-21T00:29:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising