ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎలా అనుమతిచ్చారు?: జనసేన

ABN, First Publish Date - 2022-08-17T05:10:23+05:30

కలివరంలో నా గావళి నది ఒడ్డున ఆర్బీకే నిర్మాణానికి ఎలా అనుమ తిచ్చారని జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్‌రావు ప్రశ్నిం చారు.

కోతకు గురైన ఆర్బీకేను పరిశీలిస్తున్న రామ్మోహన్‌:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆమదాలవలస రూరల్‌: కలివరంలో నా గావళి నది ఒడ్డున ఆర్బీకే నిర్మాణానికి ఎలా అనుమ తిచ్చారని  జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి పేడాడ రామ్మోహన్‌రావు ప్రశ్నిం చారు. కలివరం వద్ద నాగా వళినదిలో నిర్మించిన ఆర్బీకే కోతకు గురైన ప్రాంతాన్ని మంగళవారం  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారపార్టీ నాయకులకు ముందుచూపు లేకపోవడంతో లక్షలాది రూపాయల ప్రజాధనం నీటపాలయ్యిందన్నారు.  గతఏడాది వెల్‌నెస్‌ కేంద్రం కోతకు గురై నదిలో కొట్టుకుపోయినప్పుడే చర్యలు చేపట్టి ఉంటే, ప్రస్తు తం ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. స్పీకర్‌, అధికారులు ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఆయనతోపాటు జనసేన నాయకు లు రాజశేఖర్‌, బాల మురళి, ధనుంజయరావు ఉన్నారు.

 హెచ్చరిక బోర్డుల ఏర్పాటు

ఆమదాలవలస:  కలివరం ఆర్బీకే వద్ద అధికారులు మంగళవారం హెచ్చరిక బోర్డులు ఏర్పాటుచేశారు. కలివరంలో నిర్మించిన ఆర్బీకే నాగావళి నది ఉధృతికి భవనం లోపల భాగం కొంత కోతకు గురై ఫ్లోరింగ్‌ కొట్టుకుపోయింది. గోడలు బీటలు వారడంతోపాటు కొన్ని పిల్లర్ల చుట్టూ మట్టి కోతకు గురైంది. ప్రవాహం పెరిగితే మిగతా భాగం నది ఉధృతికి కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న నేపద్యంలో మంగళవారం పంచాయతీరాజ్‌ ఈఈ ఆర్‌.గిరిధర్‌ పరిశీలించారు. అనంతరం ఆర్‌బీకే వద్దకు ఎవరూ వెల్లకుండా తాడు కట్టి హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. 




 

Updated Date - 2022-08-17T05:10:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising