ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అక్కడ ప్రభుత్వ భవనాలు ఎలా నిర్మించారు?

ABN, First Publish Date - 2022-08-17T04:42:25+05:30

నదీ తీర ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం ఎందుకు చేపట్టారు? ఇక్కడే నిర్మించాలని ఎవరు చెప్పారు? ఇందుకు ఎంత ఖర్చు చేశారు? ఇరిగేషన్‌ శాఖ అనుమతులు తీసుకున్నారా? అంటూ కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. కలివరంలో

అధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అధికారులపై కలెక్టర్‌ ఆగ్రహం

ఆమదాలవలస, ఆగస్టు 16: నదీ తీర ప్రాంతంలో ప్రభుత్వ భవనాల నిర్మాణం ఎందుకు చేపట్టారు? ఇక్కడే నిర్మించాలని ఎవరు చెప్పారు? ఇందుకు ఎంత ఖర్చు చేశారు? ఇరిగేషన్‌ శాఖ అనుమతులు తీసుకున్నారా? అంటూ కలెక్టర్‌ శ్రీకేష్‌ బాలాజీ లఠ్కర్‌ ప్రశ్నల వర్షం కురిపించారు. కలివరంలో రైతుభరోసా కేంద్రం నిర్మాణ పనులు వరదలో కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనానికి కలెక్టర్‌ స్పందించారు.  మంగళవారం ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. దీంతో అధికారులు ఉరుకులు, పరుగులు పెట్టారు. గత ఏడాది వెల్‌నెస్‌ కేంద్రం కొట్టుకుపోయినప్పుడు ఎందుకు జాగ్రత్త పడలేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నదీ తీరంలో ఆర్బీకే నిర్మాణానికి ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుధాకర్‌ స్పష్టం చేశారు. దీంతో పీఆర్‌ అధికారులు మౌనం దాల్చారు. ముందుగా గ్రొయిన్‌ నిర్మాణం చేపట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదని కలెక్టర్‌ అభిప్రాయపడ్డారు. గ్రొయిన్‌ నిర్మాణానికి రూ.8 లక్షలు ఖర్చవుతుందని అధికారులు తెలపగా.. అందుకు తగ్గట్టు అంచనాలు రూపొందించాలని..అత్యవసర సేవల కింద నిధులు విడుదల చేస్తామని చెప్పారు. వెల్‌నెస్‌, ఆర్బీకేలకు సంబంధించి నష్ట నివేదికలను ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్‌ వెంట పంచాయతీరాజ్‌ ఈఈ ఆర్‌.గిరిధర్‌, తహసీల్దారు పద్మావతి, ఎంపీడీవో రేణుక, ఏఈ అరుణకుమారి పాల్గొన్నారు.




Updated Date - 2022-08-17T04:42:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising