ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉపాధి కూలీలతో ఇంటి పనులు?

ABN, First Publish Date - 2022-07-02T05:15:57+05:30

టెక్కలి మండలం పరశురాంపురంలో ఉపాధి కూలీలతో సొంత పనులు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్‌ 29, 30 తేదీల్లో గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ శాఖ పరిధిలోని ఓ ఉద్యోగి.. తన సొంతింటి నిర్మాణ పనులకు ఉపాధిహామీ కూలీలను వినియోగించి మస్తర్‌ వేసేందుకు ప్రయత్నించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఉపాఽధికూలీలతో ఇంటి నిర్మాణం పనులు చేపడుతున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆరా తీస్తున్న ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ అధికారులు

టెక్కలి రూరల్‌, జూలై 1: టెక్కలి మండలం పరశురాంపురంలో ఉపాధి కూలీలతో సొంత పనులు చేయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జూన్‌ 29, 30 తేదీల్లో గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ శాఖ పరిధిలోని ఓ ఉద్యోగి.. తన సొంతింటి నిర్మాణ పనులకు ఉపాధిహామీ కూలీలను వినియోగించి మస్తర్‌ వేసేందుకు ప్రయత్నించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారంలో గ్రామానికి చెందిన ఫీల్డ్‌ అసిస్టెంట్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫీల్ట్‌ అసిస్టెంట్‌ కనుసన్నల్లోనే మొదటిరోజు సుమారు ఐదుగురు, రెండో రోజు 15 మందికిపైగా ఉపాధి కూలీలతో.. ఇంటి నిర్మాణ పనులు చేయించి మస్తర్లు వేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో ఫీల్ట్‌అసిస్టెంట్‌తో పాటు ఆ శాఖ సిబ్బంది దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు సమాచారం. ఇందులో భాగంగా ఇంటి నిర్మాణ పనులు చేసిన కూలీలకు ఆ రెండు రోజుల తేదీల్లోని మస్టర్‌లో హాజరుకానట్లు చూపించినట్లు తెలుస్తోంది. ఉపాధి కూలీలతో సొంత పనులు చేయించుకోవడమే కాకుండా.. దానిని కప్పి పుచ్చేందుకు చేపట్టిన చర్యలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం కారణంగానే ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ అంశంపై ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ ఏపీవో ప్రసాద్‌ వద్ద ప్రస్తావించగా దీనిపై ఇప్పటికే గురువారం పరిశీలించామన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లానని.. ఫీల్డ్‌అసిస్టెంట్‌కు మెమో జారీ చేసి విచారణ చేపడతామని తెలిపారు.  

 

Updated Date - 2022-07-02T05:15:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising