ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘శివారు’కి సాగునీటి గండం

ABN, First Publish Date - 2022-08-08T05:24:54+05:30

వంశధార ప్రధాన ఎడమ కాలువ పరిధిలో శివారు ప్రాంత రైతులకు ఏటా సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. హిరమండలంలోని గొట్టాబ్యారేజ్‌ నుంచి వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి వరకు 104.7 కిలోమీటర్ల మేర ఈ కాలువ విస్తరించి ఉంది. మొత్తంగా 2,460 క్యూసెక్కుల సాగునీరు రావాల్సి ఉంది. కాగా.. వంశధార కాలువల్లో పూడికలు, గుర్రపుడెక్క అడ్డంకులతో శివారు ప్రాంత రైతులకు శాపంగా మారింది. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, పలాస, వజ్రపుకొత్తూరు మం

కణితివూరు సమీపంలో కాలువలో పూడికలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క 

- ఆందోళనలో రైతులు

(టెక్కలి)

వంశధార ప్రధాన ఎడమ కాలువ పరిధిలో శివారు ప్రాంత రైతులకు ఏటా సాగునీటి ఇబ్బందులు తప్పడం లేదు. హిరమండలంలోని గొట్టాబ్యారేజ్‌ నుంచి వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగి వరకు 104.7 కిలోమీటర్ల మేర ఈ కాలువ విస్తరించి ఉంది. మొత్తంగా 2,460 క్యూసెక్కుల సాగునీరు రావాల్సి ఉంది. కాగా.. వంశధార కాలువల్లో పూడికలు, గుర్రపుడెక్క అడ్డంకులతో శివారు ప్రాంత రైతులకు శాపంగా మారింది. టెక్కలి, నందిగాం, సంతబొమ్మాళి, పలాస, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన శివారు ప్రాంత రైతులు సాగునీటి కోసం వంశధార కార్యాలయాలు చుట్టూ తిరగడం పరిపాటిగా మారింది. అధికారుల అనాలోచిత నిర్ణయాలతో తమకు సక్రమంగా సాగునీరు అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన ఎడమ కాలువలో పూడికలు, గుర్రపుడెక్క తొలగించకుండా అక్కడక్కడా కాలువగట్టుపై గ్రావెల్‌తో రహదారులు నిర్మించడం విమర్శలకు తావిస్తోంది. మదనగోపాలసాగరం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ప్రాంతానికి సాగునీరు వెళ్లాల్సిన ఇన్‌లెట్‌ ముఖద్వారం వద్ద,  జాతీయరహదారి సుభద్రాపురం, నరేంద్రపురం, కణితివూరు ఇలా పలు ప్రాంతాల్లో కాలువల్లో పూడికలు తొలగించలేదు. కానీ ఆయా ప్రాంతాల్లో వంశధార ప్రధాన కాలువ గట్లపై రహదారులు ఏర్పాటు చేశారు. గత నెల 12న వంశధార ప్రధాన ఎడమ కాలువ ద్వారా సాగునీరు విడిచిపెట్టారు. కానీ, ఇప్పటివరకు మదనగోపాలసాగరం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌కు, శివారు ప్రాంతానికి సాగునీరు రావడం లేదు. ఇప్పటికే నందిగాం, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన రైతులు శివారు ప్రాంతాలకు సాగునీరు రావడం లేదని ధర్నాలు చేశారు. అధికారులు స్పందించి సక్రమంగా సాగునీరందేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. శివారు ప్రాంతాల్లో సాగునీటి సమస్య విషయమై వంశధార ఈఈ కె.శ్రీకాంత్‌ వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా కొన్నిచోట్ల కాలువల్లో పూడికలు తొలగించేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని తెలిపారు. పూడికలు తొలగించేందుకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. 



Updated Date - 2022-08-08T05:24:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising