ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవిత్ర మాసం.. ధనుర్మాసం

ABN, First Publish Date - 2022-12-15T23:52:59+05:30

విష్ణుమూర్తి భక్తులు పరమ పవిత్రంగా భావించే ధనుర్మాసం శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది.

గోదాదేవి అమ్మవారు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

(టెక్కలి/నరసన్నపేట)

విష్ణుమూర్తి భక్తులు పరమ పవిత్రంగా భావించే ధనుర్మాసం శుక్రవారం నుంచి ప్రారంభంకానుంది. ధన స్సులోకి సూర్యుడు ప్రవేశించడాన్ని ధనుర్మాసం అంటా రు. ఈ ఏడాది శుక్రవారం సాయంత్రం 6 గంటల 12 నిమిషాలకు ధనుర్మాసం ప్రారంభమై 2023 జనవరి 14 వరకు ఉంటుంది. ఈ నెల రోజుల పాటు విష్ణు ఆలయాల్లో ఆధ్యాత్మిక సందడి ఉంటుంది. గోదా దేవి అమ్మవారు నెల రోజుల పాటు దీక్ష చేసి భోగీపండగ రోజున రంగనాథస్వామిని వివాహ మాడుతుంది. ఈనెలలో ప్రతిరోజూ గోదాదేవికి ప్రత్యేక పూజలు, విష్ణు సహస్రనామార్చన, తిరు ప్పావై పారాయణం తదితర కార్యక్రమాలు నిర్వ హిస్తారు. భక్తులు సైతం విష్ణు ఆలయాల్లో జరిగే ధనుర్మాస పూజల్లో తులసిపత్రి, తులసి మాలలతో పాల్గొంటా రు. శ్రీకృష్ణ భగవానునికి పూజలు చేయడంతో పాటు కృష్ణ జపం చేస్తారు. గోదాదేవి పూజల్లో భాగంగా కట్టె పొంగలి, వెన్న, అటుకులు, తాలింపు శనగలు, దద్దోజనం, అప్పాలు, చక్రపొంగలి, పులిహోరా, పరమాన్నం, పూర్ణాలు, అట్లు వంటి ప్రసాదాలను నైవేద్యంగా పెడతారు. యుక్త వయసులో ఉన్న వారు నెలరోజుల పాటు గోదాదేవి పూజల్లో పాల్గొంటే వివాహా లు జరుగు తాయని భావిస్తారు. ఈ ధనుర్మాసం ప్రారంభం రోజు నుంచి కనుమ వరకు ప్రతి ఇంటి వాకిళ్లలో మహిళలు ముగ్గులు వేస్తుంటారు. మేలు కొలుపులు, గంట జంగాలు పాటలు, గంగిరెద్దుల ఆటలు, కోడిపందెళ్లతో గ్రామాల్లో ఈ నెల రోజులూ పండగ వాతావరణం ఉంటుంది. కొత్తబట్టలు కొనుగోలు చేసి పితృదేవతలకు సమర్పిస్తారు. జనవరి 2న సోమవారం వైకుంఠ ఏకాదశి నాడు విష్ణు ఆలయాల్లో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు.

Updated Date - 2022-12-15T23:53:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising