ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High tension.. లోకేష్ అదుపులోకి తీసుకున్న పోలీసులు...

ABN, First Publish Date - 2022-08-21T17:31:29+05:30

నారా లోకేష్ (Nara Lokesh) శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ నెలకొంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం (Srikakulam): టీడీపీ  జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శ్రీకాకుళం జిల్లా పర్యటన నేపథ్యంలో హై టెన్షన్ (High tension) నెలకొంది. ఆదివారం ఉదయం శ్రీకాకుళంకు చేరుకున్న లోకేష్‌ను పోలీసులు అదుపులో తీసుకుని 20 నిమిషాల నుంచి శ్రీకాకుళం-ఎచర్ల  హైవే మీద తిప్పుతున్నారు. దీంతో లోకేష్‌ని పోలీసులు ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియక టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. ఎచ్చర్ల వైపు తీసుకువెళ్లారని టీడీపీ మహిళా నాయకురాలు కావాలి గ్రీష్మ చెప్పారు. 


శ్రీకాకుళం కొత్త రోడ్ జంక్షన్‌లో, పలాసలో భారీగా పోలీసులు మోహరించారు. పలాస టీడీపీ కార్యాలయం (TDP Office) ముట్టడికి వైసీపీ (YCP) శ్రేణులు పిలుపునిచ్చారు. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆంక్షలు విధిస్తూ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ (144 Section)  విధించారు. ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలు మోహరించాయి. ఆదివారం సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ హెచ్చరించారు. 

Updated Date - 2022-08-21T17:31:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising