ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సచివాలయ మహిళా ఉద్యోగినికి వేధింపులు

ABN, First Publish Date - 2022-06-29T05:10:26+05:30

పొందూరు సచివాలయం-3లో విధులు నిర్వహిస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగికి పి.సుధీర్‌ అనే వలంటీరు ప్రేమ పేరిట వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇటీవల వేధింపులు అధికం కావడంతో సదరు మహిళా ఉద్యోగి దిశ యాప్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


దిశ యాప్‌ ద్వారా కేసు పెట్టిన బాధితురాలు
వలంటీరుపై కేసు నమోదు
పొందూరు, జూన్‌ 28:
పొందూరు సచివాలయం-3లో విధులు నిర్వహిస్తున్న సచివాలయ మహిళా ఉద్యోగికి పి.సుధీర్‌ అనే వలంటీరు ప్రేమ పేరిట వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇటీవల వేధింపులు అధికం కావడంతో సదరు మహిళా ఉద్యోగి దిశ యాప్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో ఆయనపై కేసు నమోదుచేసినట్టు ఎస్‌ఐ తెలిపారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. సచివాలయ ఉద్యోగిపై గత ఆరు నెలలుగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. విధి నిర్వహణలో భాగంగా ఎవరితోనైనా ఫోన్‌ లో మాట్లాడితే.. ఎందుకు మాట్లాడుతున్నావ్‌? ఎవరితో అంటూ ప్రశ్నిస్తున్నాడు. దీంతో విసిగిపోయిన సదరు ఉద్యోగి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. వారు కౌన్సెలింగ్‌ ఇచ్చినా వలంటీరు సుధీర్‌ వినలేదు. చివరకు పోలీస్‌స్టేషన్‌ కు పంచాయితీ వెళ్లింది. వారు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. అయినా సుధీర్‌ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇటీవల వేధింపులు అధికం కావడంతో సదరు ఉద్యోగి నేరుగా దిశ యాప్‌ లోనే ఫిర్యాదు చేసింది.  పోలీస్‌ కేసు నమోదైంది. కానీ పంచాయతీ అధికారులు మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు.


Updated Date - 2022-06-29T05:10:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising