‘గ్రిగ్స్’ ఓవరాల్ చాంపియన్‌గా కుప్పిలి
ABN, First Publish Date - 2022-12-15T23:57:22+05:30
తొగరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన డివిజన్ స్థాయి గ్రిగ్స్ పోటీలు గురువారం ముగిశాయి. ఓవరాల్ చాంపియన్‌గా ఎచ్చెర్ల మండలం కుప్పిలి ఉన్నత పాఠశాల నిలిచింది.
- ముగిసిన డివిజన్ స్థాయి పోటీలు
ఆమదాలవలస: తొగరాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మైదానంలో మూడు రోజుల పాటు నిర్వహించిన డివిజన్ స్థాయి గ్రిగ్స్ పోటీలు గురువారం ముగిశాయి. ఓవరాల్ చాంపియన్‌గా ఎచ్చెర్ల మండలం కుప్పిలి ఉన్నత పాఠశాల నిలిచింది. ఈ పోటీలకు ఎనిమిది మండలాల నుంచి రెండు వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, షటిల్, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిట్, లాంగ్, హై, ట్రిపుల్ జంప్, షార్ట్‌ఫుట్, డిస్క్‌త్రో, జావిలన్‌త్రో, పరుగు పందాల్లో తలబడ్డారు. విజేతలకు పాఠశాల ఉపాధ్యాయులు, స్వర్ణోత్సవ కమిటీ ప్రతినిధులు బహుమతులను అందజేశారు. అఫీషియల్ మేనేజర్ ఎన్‌వీ కుమార్, పీఈటీల జిల్లా సంఘం అధ్యక్షుడు మొజ్జాడ వెంకటరమణ, కార్యదర్శి బొడ్డేపల్లి సురేష్, పాత్రుని రమేష్, బి.పాపినాయుడు పాల్గొన్నారు.
Updated Date - 2022-12-15T23:57:23+05:30 IST