ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ధనుర్మాస పూజలు

ABN, First Publish Date - 2022-12-16T23:15:50+05:30

ఉత్తర నక్షత్రం మహాలక్ష్మి అమ్మవారికి ధనుర్మాస పూజలు శుక్రవారం నిర్వహించారు. సాయంత్రం తిరుప్పావై పారాయణం చేశారు.

ఇచ్ఛాపురంలో స్వేచ్చావతి అమ్మవారికి పూజలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం కల్చరల్‌: ఉత్తర నక్షత్రం మహాలక్ష్మి అమ్మవారికి ధనుర్మాస పూజలు శుక్రవారం నిర్వహించారు. సాయంత్రం తిరుప్పావై పారాయణం చేశారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు చామర్తి గోపాలాచార్యులు, బిర్లంగి రామ్మోహన్‌, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. అలాగే పాలకొండరోడ్డలో ఉన్న కోదండరామాలయంలో అర్చకులు బంకుపల్లి శేషాచార్యులు ఆధ్వర్యంలో ధనుర్మాసం పూజలు నిర్వహించారు. పీఎన్‌ కాలనీలోని నారాయణ తిరుమలలో, శివబాలాజీ వేంకటేశ్వరాలయంలో నాగావళి నదీతీరంలోగల కళ్యాణ వేంకటేశ్వరాలయంలో పూజలు చేపట్టారు.

స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో...

ఇచ్ఛాపురం: గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం వేకువ జాము నుంచే సిందూర మర్దన, పంచామృ తాలతో అభిషేకాలు, కుంకుమార్చనలు, హో మాలు జరిపారు. మధ్యాహ్నం అన్నసంతర్పణ నిర్వహించారు. అలాగే జగన్నాథస్వామి ఆలయంలో ఆలయ మేనేజర్‌ బెంది రామా రావు పర్యవేక్షణలో ధనుర్మాసం పూజలు నిర్వ హించారు. విశ్వక్ఛేన పూజ, పుణ్యాహ వచనం, రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వారికి తులసిమాలలతో అర్చన జరిపారు. ఆలయప్రధాన అర్చకులు రామప్రసాద్‌ సిద్ధాం తి, పద్మకుమార్‌ ఆచార్యులు వైదిక కార్య క్రమాన్ని నిర్వహించారు.

Updated Date - 2022-12-16T23:15:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising