ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దళారులకే ధాన్యం

ABN, First Publish Date - 2022-11-30T00:14:50+05:30

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు సీజన్‌ ప్రారంభమైంది. కీలక ప్రజాప్రతినిధుల సొంత ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. నిబంధనల ప్రకారం రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి.. నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాలి. కానీ, కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకముందే దళారులు.. వ్యాపారులు రంగప్రవేశం చేశారు. ముందుగానే రైతులకు కొంత అడ్వాన్స్‌ ఇచ్చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన సమయంలో ఆ అడ్వాన్స్‌ను మినహాయించి.. మిగిలిన సొమ్మును అందజేయనున్నారు.

జమ్ములో రోడ్డుపై ధాన్యం ఆరబెడుతున్న అన్నదాతలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- ముందుగానే రైతులకు అడ్వాన్స్‌లు

- పూర్తిస్థాయిలో ప్రారంభంకాని కొనుగోలు కేంద్రాలు

- ‘తేమ శాతం’ ఆంక్షల కారణంగా ఇబ్బందులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి/ నరసన్నపేట)

ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు సీజన్‌ ప్రారంభమైంది. కీలక ప్రజాప్రతినిధుల సొంత ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మిగిలిన ప్రాంతాల్లో ఎక్కడా పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు. నిబంధనల ప్రకారం రైతులు పండించే ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి.. నేరుగా వారి బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయాలి. కానీ, కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాకముందే దళారులు.. వ్యాపారులు రంగప్రవేశం చేశారు. ముందుగానే రైతులకు కొంత అడ్వాన్స్‌ ఇచ్చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన సమయంలో ఆ అడ్వాన్స్‌ను మినహాయించి.. మిగిలిన సొమ్మును అందజేయనున్నారు. ఈ క్రమంలో రైతులు దోపిడీకి గురవుతున్నారు. జిల్లాలో ఈ ఏడాది ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నుల మేర ధాన్యం దిగుబడి వచ్చే అవకాశముంది. గృహావసరార్థం 50 మెట్రిక్‌ టన్నుల పోను.. మిగిలిన 7.5 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ చేయాలని జిల్లా అధికారులు లక్ష్యం నిర్దేశించారు. ప్రస్తుతం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడా కానరావడం లేదు. రెండు, మూడు ప్రాంతాల్లో మొక్కుబడిగా కేంద్రాలు ప్రారంభించారు. కానీ, ఎక్కడా కొనుగోలు ఇంకా చేపట్టలేదు. కొన్ని ప్రాంతాల్లో వరికోతలు కొనసాగుతున్నాయి. గ్రామాల్లో రైతులకు కొంతమంది వ్యాపారులు అడ్వాన్స్‌ చెల్లించి.. కల్లాల నుంచే ధాన్యం తీసుకుపోతున్నారు. ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువ శాతం ధాన్యం ఒడిసాకు తరలిపోతున్నాయి. అక్కడి వ్యాపారులు ధాన్యం ఇచ్చిన వెంటనే నగదు చెల్లిస్తుంటారు. దీంతో ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి, సోంపేట, మందస, పాతపట్నం మండలాల్లోని సరిహద్దు ప్రాంతాల్లో ధాన్యం ఒడిసాకు తరలిస్తున్నారు.

నిబంధనలతో ఇబ్బందులు

నిబంధనల మేరకు కల్లాల్లో ధాన్యాన్ని మిల్లు వద్దకు చేర్చేందుకు రైతులే రవాణా సొమ్ము భరించాలి. ఇది వారికి పెనుభారంగా మారింది. మరోవైపు తేమశాతంపై ఆంక్షల కారణంగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. తేమశాతం 17 ఉండాల్సిందే. 75 కిలోల బస్తాకు 18 శాతం వస్తే కిలో తరుగు, 19 శాతం వస్తే రెండు కిలోలు తరుగుగా తీసివేస్తున్నారు. అదే 21 శాతంగా తేమ ఉంటే.. కల్లాల్లో ఆరబెట్టి మళ్లీ తీసుకురావాల్సిందే. ఎన్నడూ లేనివిధంగా ఆంక్షలు విధిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇన్ని ఇబ్బందులు పడినా ధాన్యం విక్రయించిన వెంటనే ప్రభుత్వం నగదు చెల్లిస్తుందనే నమ్మకం రైతులకు లేదు. దీంతో చాలామంది రైతులు స్థానిక వ్యాపారులను, దళారులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా తేమశాతం విషయాన్ని ప్రస్తావించకుండా.. 80కిలోల బస్తాలు చొప్పున ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇవే ధాన్యాన్ని ఫలానా రైతుల నుంచి కొనుగోలు చేసినట్టు.. ఆ వ్యాపారులు సర్వే నెంబర్లతో సహా వివరాలను నమోదు చేయిస్తున్నారు. దీంతో రైతులు దోపిడీకి గురవుతున్నారు.

బ్యాంకు గ్యారంటీ ఇవ్వని మిల్లర్లు

ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని సేకరించి.. వాటిని బ్యాంకు గ్యారంటీ ఉన్న మిల్లర్లకు అప్పగిస్తారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభం నాటికే బ్యాంకు గ్యారంటీలను సమర్పించాలి. అలా అయితేనే పూర్తిస్థాయిలో కొనుగోలు కేంద్రాల నుంచి ఎప్పటి ధాన్యం అప్పుడే మిల్లులకు చేరుకుంటాయి. వీటిని రెవెన్యూ అధికారులతోపాటు.. ఇతర అధికారులు కూడా పర్యవేక్షిస్తుంటారు. జిల్లాలో మొత్తం అన్ని మిల్లర్ల నుంచి రూ.250 కోట్ల మేర ధాన్యాన్ని మరపట్టించేందుకు బ్యాంకు గ్యారంటీలు సమర్పించాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు కేవలం రూ.6కోట్లు మాత్రమే బ్యాంకు గ్యారంటీ కింద మిల్లర్ల నుంచి జిల్లా అధికారులకు చేరింది. పూర్తిస్థాయిలో సమర్పిస్తేనే.. కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుంది.

అధికంగా పెట్టుబడి.. అరకొరగా దిగుబడి

అన్నదాతలకు కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది సుడిదోమ, తెగుళ్లు, తుఫాన్‌ బెడదతో పెట్టుబడులు భారీగా పెరిగిపోయాయి. ఎకరాకు సుమారు రూ.17వేలు వరకు ఖర్చయింది. ఆశించినస్థాయిలో దిగుబడి మాత్రం రాలేదు. తేలిక రకాలైన 333, సంపద సర్ణ, ఆర్‌జీఎల్‌, జగిత్యాల, వరంగల్‌ సాంబ వంటివి గత ఏడాది ఒక ఎకరాకు 25 క్వింటాల వరకు దిగుబడి వచ్చింది. ఈ ఏడాది 15 క్వింటాల్‌ నుంచి 20 క్వింటాలు మాత్రమే వస్తోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో తెగుళ్ల కారణంగా సుమారు 20 వేల ఎకరాల్లో పంట దెబ్బతింది. సంతబొమ్మాళి, కోటబొమ్మాళి, పోలాకి, నరసన్నపేట, ఇచ్ఛాపురం, కవిటి, గార, ఎల్‌.ఎన్‌.పేట, బూర్జ తదితర మండలాల్లో సకాలంలో సాగునీరు అందక.. మరో 30 వేల ఎకరాల్లో పంట నాశనమైంది. దీంతో దిగుబడులు ఘననీయంగా తగ్గిపోయాయి. పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు కూడా ఎదురుచూడాల్సిన దుస్థితి నెలకొంది. రైతుభరోసా కేంద్రాల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు ప్రక్రియ ప్రారంభం కాలేదు. దీంతో కల్లాల్లో ధాన్యం మగ్గుతున్నాయి. మరోవైపు వాతావరణం గుబులు రేపుతుండడంతో కొంతమంది రైతులు తక్కువ ధర అయినా సరే.. దళారులకు విక్రయిస్తున్నారు. పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధర పెంచాలని రైతులు కోరుతున్నారు. కనీసం క్వింటాకు రూ.200 చొప్పున పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై వ్యవసాయశాఖ ఏడీ రవీంద్ర భారతి వద్ద ప్రస్తావించగా.. రైతుభరోసా కేంద్రాల ద్వారా ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేస్తామని తెలిపారు.

కొనుగోలు ప్రారంభించాం:

ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాం. మార్చి వరకు కొనుగోలు ప్రక్రియ చేపడతాం. కొన్ని ప్రాంతాల్లో వరి కోతలు కొనసాగుతున్నాయి. రైతులు కల్లాల్లో ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం ఎక్కువ లేకుండా తీసుకువస్తే.. తరుగు ఉండదు. క్వింటా ఏ-గ్రేడ్‌ ధాన్యానికి రూ.2060, సాధారణ రకం రూ.2040 చొప్పున చెల్లిస్తాం. ఎవరైనా వ్యాపారులకు రైతులు ధాన్యం విక్రయిస్తే.. ఆ సర్వే నంబర్లను బ్లాక్‌ చేస్తాం. దానివల్ల ఆ నంబర్లను చూపించుకునేందుకు వీలుండదు. డిసెంబర్‌లో మిగిలిన మిల్లర్లందరూ బ్యాంకు గ్యారెంటీలు సమర్పిస్తారు.

- జయంతి, జిల్లా మేనేజర్‌, పౌరసరఫరాల శాఖ

-------------------------

371 కేంద్రాలు ఏర్పాటు

హిరమండలం, నవంబరు 29 : జిల్లాలో 371 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని జేసీ నవీన్‌కుమార్‌ తెలిపారు. మంగళవారం హిరమండలం మండలంలోని మహాలక్ష్మీపురం రైతుభరోసా కేంద్రాన్ని ఆయన సందర్శించారు. సేకరణకు సిద్ధంగా ఉన్న ధాన్యం నాణ్యతను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుభరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తామని తెలిపారు. ‘ఈ ఏడాది 4.51 మెట్రిక్‌ టన్నులు ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ధేశించాం. డిసెంబరు మొదటి వారానికి అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం. ఇప్పటివరకు 10 రైసు మిల్లుల పరిధిలో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. రైతు కళ్లాల వద్ద ధాన్యాన్ని పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా కొనుగోలు చేస్తామ’ని జేసీ తెలిపారు. రైతులకు నూతన కొనుగోలు విధానంపై అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. రైతు వద్ద కొనుగోలు చేసిన ధాన్యానికి క్వాలిటితో సహా అన్ని వివరాలు నమోదు చేసి రసీదు ఇవ్వాలని తెలిపారు. అనంతరం వంశధార రిజర్వాయర్‌ను పరిశీలించారు. వంశఽధార నిర్వాసితులకు సంబంధించి అదనపు పరిహారం మంజూరుకు రూ.16 కోట్లతో ప్రభుత్వానికి బిల్లు పెట్టామని తెలిపారు. నిధులు విడుదలైన వెంటనే చెల్లిస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌వో డీవీ రమణ, జిల్లా సివిల్‌ సప్లై మేనేజర్‌ పి.జయంతి, తహసీల్దారు మురళీమోహన్‌, ఎంపీడీవో బి.శైలజ, ఏవో సంధ్య, పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఏవీ సురేష్‌, సీఈవో లోలుగు మోహన, రఘు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-30T00:14:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising