ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధంకండి: సీపీఎం

ABN, First Publish Date - 2022-08-10T05:04:49+05:30

దేశ సంపదను, స్వాతంత్ర్యాన్ని కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని, వారి బారినుంచి దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.

శ్రీకాకుళంలో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు:
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అరసవల్లి/ఎచ్చెర్ల/ఇచ్ఛాపురం/లావేరు, ఆగస్టు 9: దేశ సంపదను, స్వాతంత్ర్యాన్ని కార్పొరేట్‌ శక్తులకు కేంద్ర ప్రభుత్వం ధారాదత్తం చేస్తోందని, వారి బారినుంచి దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటం చేయాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు.  స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుందాం పేరిట  సీపీఎం ఆధ్వ ర్యంలో మంగళవారం  ప్రచార జాతాను  నిర్వహించారు.  శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఇచ్ఛాపు రం, లావేరులలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌కు దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఎటువంటి పాత్ర లేకపోయినా ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ పేరిట కపట దేశభక్తిని ప్రదర్శిస్తున్నారని విమర్శించా రు. దేశ ప్రజలు ఈ నిజాన్ని గుర్తించాలన్నారు. కులాలు, మతాల పేరిట దేశాన్ని అశాంతికి గురిచేయడమేనా దేశభక్తి అంటే అని వారు ప్రశ్నిం చారు. కార్పొరేట్లకు రూ.10 లక్షల కోట్ల రాయితీలను ఇచ్చి, పేద, మధ్యతరగతి వర్గాలపై పన్నుల భారాన్ని మోపడమేనా మీ దేశభక్తి అని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు, మహిళలను కేంద్రప్రభుత్వం మోసం చేసిందన్నారు. ప్రజాస్వా మ్యానికి, రాజ్యాంగానికి తూట్లు పొడిచి తన సొంత రాజ్యాంగాన్ని బీజేపీ అమలు చేస్తోందని విమర్శించారు.  దేశాన్ని కాపాడుకోవడానికి మరో స్వాతంత్య్ర పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపుని చ్చారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు బి.తులసీదాస్‌, జిల్లా కార్యదర్శులు జి. సింహాచలం,  జి.గోవిందరావు, నాయకులు పి.తేజేశ్వరరావు, సీహెచ్‌ అమ్మన్నాయుడు, వెలమల రమణ, టి.తిరుపతిరావు, డి.రమణారావు, బి.మోహనరా వు, ఎం.ఆదినారాయణమూర్తి, ఎ.సోమశేఖర్‌, డి.పార్వతీశం, బుచ్చిబాబు, కె.అప్పలరాజు, జ్యోతిప్రసాద్‌, లలిత, రామచంద్ర, తారక్‌, శ్రీను, నాయుడు, రాజు, ఎన్వీ రమణ, కృష్ణమూర్తి,  పుల్లెల వెంకటరమణ(చిన్ని), కె.మోహన్‌రావు, సీఐటీయూ జిల్లా కోశాధికారి అల్లూ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.




 


Updated Date - 2022-08-10T05:04:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising