ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత బియ్యానికి మంగళం!

ABN, First Publish Date - 2022-07-22T05:33:44+05:30

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డింది. వరుసగా నాలుగో నెలలోనూ ఉచిత బియ్యం పథకానికి మంగళం పాడింది. దీంతో కార్డుదారులు నిరాశ చెందుతున్నారు. ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వటం లేదని డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లును ప్రశ్నిస్తున్నారు.

బియ్యం పంపిణీ చేస్తున్న దృశ్యం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నాలుగు నెలలుగా అందని వైనం
- నిరాశ చెందుతున్న కార్డుదారులు
(హరిపురం)

కేంద్ర ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న బియ్యానికి రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డింది. వరుసగా నాలుగో నెలలోనూ ఉచిత బియ్యం పథకానికి మంగళం పాడింది. దీంతో కార్డుదారులు నిరాశ చెందుతున్నారు. ఉచిత బియ్యం ఎందుకు ఇవ్వటం లేదని డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లును ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో సుమారు 6.55లక్షల బియ్యం కార్డులు ఉన్నాయి. వీటిద్వారా ప్రతినెలా సుమారు 8మెట్రిక్‌ టన్నుల మేరకు బియ్యం కేటాయిస్తారు. కొవిడ్‌ నేపథ్యంలో అల్పాదాయ కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీభ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎంజీకేవై) పథకాన్ని అమల్లోకి తెచ్చింది. బియ్యం కార్డులో ఒక్కో సభ్యుడికి 5కేజీలు చొప్పున ఉచిత బియ్యం పంపిణీ చేసింది. లాక్‌డౌన్‌ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు పడిన ఎంతోమందికి ఈ పథకం ఉపయోగపడింది. ఈ ఏడాది సెప్టెంబరు వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. కాగా జిల్లాలో ఏప్రిల్‌ నుంచి ఉచిత బియ్యం పంపిణీ ప్రక్రియ నిలిచిపోయింది. నాలుగు నెలలుగా బియ్యం నిల్వలు గోదాములకు, రేషన్‌ డీలర్ల వద్దకు చేరడం లేదు. ఫలితంగా ఉచిత బియ్యం అందక కార్డుదారులు నిరాశ చెందుతున్నారు. కేంద్రం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. అయినప్పటికీ ఉచిత బియ్యం పంపిణీ విషయమై స్పందన కరువవుతోంది.  

ఆదేశాలు రాలేదు
ఉచిత బియ్యం పంపిణీపై ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. ఉత్తర్వులు వచ్చిన తరువాతే ప్రభుత్వ ఆదేశాల మేరకు బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటాం.
 - వెంకటరమణ, డీఎస్‌వో, శ్రీకాకుళం

 

Updated Date - 2022-07-22T05:33:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising