నేరాల నియంత్రణపై దృష్టి సారించాలి: ఎస్పీ
ABN, First Publish Date - 2022-03-06T05:17:43+05:30
జిల్లాలో నేరాల ని యంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశిం చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.
శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, మార్చి 5: జిల్లాలో నేరాల ని యంత్రణపై దృష్టి సారించాలని ఎస్పీ అమిత్‌బర్దర్ ఆదేశిం చారు. జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రతికేసు పూర్వాపరా లను, ఇతరత్రా వివరాలను ఖచ్చితంగా సీసీటీఎన్‌ఎస్ అప్లి కేషన్‌లో నమోదు చేయాలని చెప్పారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జాతీయ రహ దారిపై ప్రమాదాల నియంత్రణకు రోడ్డు భద్రతా నిబంధ నలు అమలు చేయాలన్నారు. ఉల్లంఘించినవారికి జరిమానా విధించాలన్నారు. అంతటా విజుబుల్ పోలీసింగ్ నిర్వహించాలన్నారు. మైనర్ బాలికలు, మహిళలపై నేరాలకు పాల్పడే వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచా లన్నారు. సమగ్రమైన వివరాలతో ఛార్జిషీటు దాఖలు చేయాలని తెలిపారు. సారా తయారీ, అక్రమ రవాణా జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు విఠలేశ్వరరావు, సోమశే ఖర్, డీఎస్పీలు మహేంద్ర, వీరకుమార్, శివరామిరెడ్డి, బాలరాజు, ప్రసాదరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Updated Date - 2022-03-06T05:17:43+05:30 IST